భారత చిత్రపటంలో తెలంగాణ గాయబ్ 

ఆంధ్రప్రదేశ్ బిజెపి నిర్వాకం 
తెలంగాణ రాష్ట్రం అస్తిత్వాన్ని ప్రశ్నించడమే ..: కేటీఆర్ ఫైర్

 

ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షులు మాధవ్, ఏపీ మంత్రి లోకేష్ కు  ఇచ్చిన భారత చిత్రపటంలో తెలంగాణ లేకపోవడంపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ  భారతదేశ చిత్రపటం నుంచి తెలంగాణను తొలగించడం పై వెంటనే బీజేపీ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు  తెలంగాణ అస్తిత్వాన్ని భౌగోళిక గుర్తింపుని గుర్తించకపోవడం బిజెపి అధికారిక విధానమా ప్రధాని నరేంద్ర మోదీ ని  ప్రశ్నిస్తూ
కేటీఆర్  పలు ప్రశ్నలు సంధించారు.
“దశాబ్దాలపాటు తెలంగాణ సాంస్కృతిక గుర్తింపు కోసం, చరిత్రలో తమకు సరైన చోటు దక్కడం కోసం, ప్రత్యేక భౌగోళిక గుర్తింపు, ప్రత్యేక రాష్ట్రం కోసం ఎనలేని పోరాటాలు చేసింది తెలంగాణ గడ్డ..అయితే మీ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు మా సాంస్కృతిక గుర్తింపు, అస్తిత్వాన్ని ప్రశ్నార్ధకం చేసేలా భారతదేశ చిత్రపటాన్ని ఉపయోగించారు.. అయితే, మీ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు మాధవ్  బహుమతిగా ఇచ్చిన మ్యాప్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని మాత్రమే చూపించడం దారుణం..తెలంగాణ రాష్ట్రం అస్తిత్వాన్ని లెక్కచేయకుండా చేసిన చర్య మమ్మల్ని తీవ్రంగా బాధించింది…ఇది పూర్తిగా అనుచితమైంది…భారతదేశ చిత్రపటం నుంచి మా చరిత్రనే తొలగిస్తే మేమెవరం?
…ఇది మీ పార్టీ అధికారిక అభిప్రాయమా? అని ప్రధానమంత్రి మోదీ ని ప్రశ్నిస్తూ  లేదా ఈ చర్య కేవలం ఒక పొరపాటా అనే విషయంపై  వెంటనే పీఎం మోదీ  స్పష్టత ఇవ్వాలి ఇది తెలంగాణ ప్రజల త్యాగాలు, రాష్ట్ర సాధన కోసం చేసిన పోరాటాలను, బలిదానాలను అగౌరవపరచడమే కాకుండా మా చరిత్రను నిర్లక్ష్యం చేసిన బిజెపి నేతలు క్షమాపణ చెప్పాలి పొరపాటైతే, తెలంగాణ ప్రజలని అపహాస్యం చేసినందుకు బిజెపి  పార్టీ నాయకత్వం వెంటనే క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *