– న్యూ ఇయర్ వేడుకల్లో అపశృతి
న్యూదిల్లీ, జనవరి 1: నూతన సంవత్సరం వేళ స్విట్జర్లాండ్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ స్కీ రిసార్ట్ నగరం క్రాన్స్ మోంటానాలో ఓ బార్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 40 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. ఈ మేరకు స్థానిక అధికారిక వర్గాలను ఉటంకిస్తూ అంతర్జాతీయ డియా కథనాలు వెల్లడించాయి. మరో 100 మందికి గాయపడినట్లు తెలిపాయి. మృతుల సంఖ్యపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. బార్‌లో నూతన సంవత్సర వేడుకలు జరుగుతుండగా అర్ధరాత్రి 1.30 గంటలకు ఈ పేలుడు చోటుచేసుకుంది. పేలుడు ధాటికి భారీగా మంటలు చెలరేగాయి. సమాచారమందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఈ ఘటనలో ఉగ్ర కుట్ర లేదని అధికారిక వర్గాలు వెల్లడించాయి. బాణసంచా కారణంగా ఈ పేలుడు సంభవించి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. స్విస్ ఆల్పస్ పర్వతశ్రేణుల నడుమ ఉన్న ఈ క్రాన్స్ మోంటానా నగరం ప్రముఖ పర్యాటక స్థలం. ఏటా డిసెంబరు-జనవరి సమయంలో ఇక్కడ పర్యాటకుల తాకిడి విపరీతంగా ఉంటుంది. గత కొంతకాలంగా ఇక్కడ కార్చిచ్చులు చోటుచేసుకుంటున్నట్లు సమాచారం.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





