పెయింటింగ్ ద్వారా ముఖ్య మంత్రి  రేవంత్‌ రెడ్డి కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు 

-ఒక యువ‌చిత్ర‌కారుడి య‌త్నం

కొడంగల్ ప్రజాతంత్ర నవంబర్ 7 : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పై గుండెల్లో దాచుకున్న అభిమానాన్నికొడంగల్ నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండల పరిధిలోని యాంకి గ్రామానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు సున్నపు అశోక్  తన కుంచెతో ఆవిష్కరించాడు. ముఖ్యమంత్రి తన కొడంగల్ నియోజకవర్గానికి  పలు భారీ ప్రాజెక్టులను సాధించి   అన్ని విధాలుగా ఆదుకుంటానని పలు వేదికలపై భావోద్వేగంగా చెప్పిన మాటలకు చిత్ర రూపాన్నిఇచ్చాడు. నేడు ముఖ్యమంత్రి జన్మదిన సందర్భంగా  పెయింటింగ్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు చెప్పి సీఎం రేవంత్ రెడ్డి పై అభిమానాన్ని చాటుకున్నాడు.  మా అభిమాన నాయకుడికి కృతజ్ఞతలు చెప్పాలన్న సంకల్పంతోనే ఈ చిత్రాన్ని వేశానని ఈ ప్రాంతం నాయకులు నా కళా సేవను గుర్తించి ముఖ్యమంత్రి దృష్టికి  తీసుకువెళ్తారన్న ఆకాంక్ష‌ను వ్య‌క్తం చేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *