బీహార్‌ ‌వోటర్ల‌ తుది జాబితా విడుదల

న్యూదిల్లీ,సెప్టెంబర్‌ 30:‌ బిహార్‌లో వోటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను పూర్తి చేసిన కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా తుది జాబితాను విడుదల చేసింది. ముసాయిదా జాబితాకు సంబంధించి వచ్చిన అన్ని ఫిర్యాదులు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని దీనిని ప్రకటించినట్లు పేర్కొంది. దీంతో మరికొన్ని రోజుల్లోనే బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ‌వెలువడే అవకాశం కనిపిస్తోంది. బిహార్‌లో 22 ఏళ్ల తర్వాత నిర్వహించిన వోటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ  కార్యక్రమం అనేక వివాదాలకు నెలవుగా మారింది. చివరకు పూర్తి చేసిన ఎన్నికల సంఘం.. ఇందుకు సంబంధించిన ముసాయిదా జాబితాను నెల క్రితం ప్రకటించింది. అభ్యంతరాలు వెల్లడించేందుకు గడువు ముగియడంతో తాజాగా తుది జాబితా విడుదల చేసినట్లు ప్రకటించింది. వోటర్లు తమ వివరాలను సంబంధిత లింక్‌ ‌ద్వారా చెక్‌ ‌చేసుకోవచ్చని బిహార్‌ ‌సీఈవో సూచించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *