బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కేంద్ర కమిటి కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ గంగన్న మృతి చెందారని కేంద్ర హోంశాఖ మంత్రి అమీత్ షా దృవీకరించారు. మావోయిస్టులపై పోరాటంలో భద్రత బలగాలు ఒక పెద్ద విజయాన్ని సాధించారని అమీత్ షా ప్రశంసించారు. 2026 మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని మరోసారి స్పష్టం చేశారు. ఈ ఎన్‌కౌంటర్‌లో భద్రత బలగాలు 27 మంది మావోయిస్టులను హతమార్చినట్లు ధృవీకరించారు.
పెద్ద విజయం కేంద్ర హోం మంత్రి అమీత్ షా ధృవీకరణ





