– మృత్యుంజయ స్వామి సన్నిధిలో అర్చన
మధిర, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15 : రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కాంక్షిస్తూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తన సతీమణి నందినితో కలిసి మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఖమ్మం జిల్లాలోని మధిరలోని గంగా పార్వతీ సమేత మృత్యుంజయ స్వామి వారిని ఆదివారం దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే రాష్ట్ర మంత్రివర్గ సభ్యుల పేరిట వారి గోత్రనామాలతో భట్టి దంపతులు ప్రత్యేక అర్చన చేయించారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు విజయవంతం కావాలని, పాలకవర్గంపై స్వామివారి ఆశీస్సులు ఉండాలని వారు ఈ సందర్భంగా మొక్కులు చెల్లించుకున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





