ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి

– స్పీకర్ ప్రసాద్ కుమార్

వికారాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 21: జిల్లాలోని గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. ఇటీవలే జిల్లా వైద్యాధికారిగా బాధ్యతలు స్వీకరించిన స్వర్ణకుమారి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో కలిసి స్పీకర్ ను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ జిల్లాలో సమర్థవంతంగా విధులు నిర్వహించి గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం స్వర్ణకుమారి జిల్లా కేంద్రంలోని తెలంగాణ డయాగ్నస్టిక్స్ హబ్ ను వైద్యాధికారులతో కలిసి సందర్శించి టీ హబ్ లోని లేబరేటరీ ప‌రిక‌రాల‌ను పరిశీలించారు. టీహబ్ లో తరచుగా నిర్ధారణ పరీక్షలకు అంతరాయం కలగడానికి గల కారణాలను టీ హబ్ ఇన్‌చార్జి శ్రీనివాస్ ను, అబ్బాట్ కంపెనీ సర్వీస్ ఇంజనీర్ ను అడిగి తెలుసుకున్నారు. మూడు నెలల నుండి టీ హబ్ లోని కొన్ని పరికరాలు తరచుగా రిపేర్ లకు గురవుతున్నాయని,  దీనివల్ల రోగులకు నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం కష్టమవుతుందని, వెంటనే రిపేర్ చేసి వాటిని పనిచేసే స్థితిలోకి తీసుకురావాలని కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి బ్యాకప్ గా ముఖ్యమైన పరికరాలను ఉంచాలని సూచించారు. టీ హబ్ లోని అన్ని గదులను, పరికరాలను పరిశీలించి వాటి పనితీరును తెలుసుకున్నారు. అనంతరం సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్ ను పరిశీలించారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుండి సేకరించిన శాంపిల్స్ ఫలితాలను వీలైనంత తొందరగా పేషెంట్లకు మెసేజ్ రూపంలో పంపించాలని, జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాల మేరకు శాంపిల్స్ సేకరించాలని, తరచుగా టీహబ్ లోని పరికరాలకు మరమ్మ రాకుండా కంపెనీ మెయింటెనెన్స్ సిబ్బంది చూసుకోవాలని సూచించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *