– డబ్బాల్లో దాచుకున్న నగదు గుర్తించిన పోలీసులు
తిరువనంతపురం, జనవరి 8: కేరళలో ఓ యాచకుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. అయితే అతని వద్ద ఉన్న డబ్బాలో సుమారు రూ.4.5 లక్షల నగదును సీజ్ చేశారు. అలప్పుజాలో ఈ ఘటన జరిగింది. వాస్తవానికి ఆ ప్రాంత ప్రజలకు ఆ యాచకుడు సుపరిచితం. రోజూ అతను ఆ ఏరియాలోనే యాచిస్తూ తిరుగుతుంటాడు. అయితే సోమవారం రాత్రి ఆ బిచ్చగాడు ప్రమాదానికి గురయ్యాడు. తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. హాస్పిటల్‌లో అతని పేరును అనిల్ కిశోర్‌గా నమోదు చేశారు. చికిత్స అనంతరం అతడు ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు. మంగళవారం ఉదయం అతడి మృతదేహం ఓ దుకాణం ముందు ఉండటాన్ని మున్సిపల్ అధికారులు గుర్తించి పోస్ట్‌మార్టం కోసం హాస్పిటల్‌కి తరలించారు. మృతదేహం వద్ద ఓ ప్లాస్టిక్ డబ్బా దొరికింది. తనిఖీ కోసం దాన్ని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు పంపించారు. స్థానిక పంచాయతీ సభ్యుడు ఫిలిప్ ఉమ్మన్ సమక్షంలో తెరిచి చూసిన అక్కడి అధికారులు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. దానినిండా డబ్బు ఉందని, అది రూ.4.5 లక్షలకు పైగా ఉంటుందని పోలీసులు తెలిపారు. సీజ్ చేసిన నగదులో రద్దు అయిన రూ.2వేల నోట్లు, విదేశీ కరెన్సీ ఉన్నాయి. అతని వద్ద అంత డబ్బు ఉన్న విషయం ఎవరికీ తెలియదన్నారు. స్వాధీనం చేసుకున్న డబ్బును కోర్టులో జమ చేయనున్నట్లు పోలీసులు చెప్పారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




