బీసీ రిజ‌ర్వేష‌న్ల‌పై రాజ్యాంగ స‌వ‌ర‌ణ చేయాలి

– 60 శాతం జ‌నాభాకు రిజ‌ర్వేష‌న్ లేక‌పోవ‌డ‌మేంటి?
– మోసం చేస్తున్న బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు
– దిల్లీలో తెలంగాణ భ‌వన్ వ‌ద్ద ఓయూ బీసీ జేఏసీ ధ‌ర్నా

న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 11: కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాల్లో వెంటనే 42% బీసీ రిజర్వేషన్ ల బిల్లును ప్రవేశ పెట్టి రాజ్యాంగ సవరణ 9వ షెడ్యూల్ చేర్చాల‌ని ఓయూ బీసీ జేఏసీ నాయ‌కులు డిమాండ్ చేశారు.  ఓయూ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో న్యూదిల్లీ లోని తెలంగాణ భవన్ అంబేద్కర విగ్రహం ముందు గురువారం బీసీ ల ఆత్మ గౌరవ దీక్ష కార్యక్రమం నిర్వ‌హించారు.  ఈ సందర్బంగా ఓయూ బీసీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ  కాంగ్రెస్ ప్రభుత్వం 42%బీసీ రిజర్వేషన్ ల బిల్లు అసెంబ్లీ లో ప్రవేశ పెట్టి అన్ని రాజకీయ పార్టీల మద్దత్తు తో గవర్నర్ కు పంపింది కాని ఆమోదం తెలుపకుండా కాలయాపన చేస్తున్నార‌ని ఆరోపించారు. 78 సంవత్సరాల గడిచిన భారత దేశం లో ఇప్పటి వరకు బీసీ లకు రిజర్వేషన్ లు లేకపోవడం సిగ్గుచేటన్నారు. దేశ జనాభాలో 60% ఉన్నపుడు రిజర్వేషన్ లు ఎందుకు లేవని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యం లో బీసీ కులాల జనాభా దేశంలో ఉన్నపుడు రిజర్వేషన్ లు కూడా విద్య, ఉద్యోగ, రాజకీయలలో కూడా ఉండాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి కే రాష్ట్రంలో బీసీ కులాలకు రిజర్వేషన్ల కల్పిద్దాం అని కృషి చేస్తున్న‌ది. మిగతా పార్టీలు కూడా బీసీలను మోసం చేయకుండా రిజర్వేషన్ల కోసం ఒత్తిడి చేయాలనీ కోరారు. బీసీ వ్యతిరేకులు హైకోర్టులో కేసు వేస్తే బీజేపీ, బీఆర్ ఎస్‌లు కేసు ఎంప్లీడ్ కాకుండా మద్దతు తెలుపకుండ మోసం చేస్తున్నాయ‌ని ఆరోపించారు. బీఆర్ఎస్‌, బీజేపీలు బీసీల గురించి తమ చిత్తశుద్ధని నిరూపించుకోవాలి. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాల‌ని డిమాండ్ చేశారు. బీసీ కులాల రిజర్వేషన్ల బిల్లును 9వ షెడ్యూల్ లో పెడితే రిజర్వేషన్లు అమలవుతాయ‌న్నారు. లేకపోతే రాజకీయ పార్టీలు బీసీ కూలాలను మోసం చేసి నట్టే అని ఆవేదన వ్యక్తం చేశారు. 42% బీసీ రిజర్వేషన్ బిల్లు కు మద్దత్తు కోసం జాతీయస్థాయిలో అన్ని పార్టిల మద్దత్తు కోరుతూ పార్లమెంట్ సమావేశంలలో ప్రైవేట్ బిల్లు పెట్టెవిదంగా ఓయూ బీసీ జేఏసీ ఢిల్లీలో కృషి చేస్తుందని అన్నారు. హైదరాబాద్ లో మళ్ళీ ఓయూ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని బీసీ రిజర్వేషన్ లను సాధిస్తామని అన్నారు. కార్యక్రమంలో ఓయూ బీసీ జేఏసీ నాయకులు డా :నిజ్జన రమేష్ ముదిరాజ్, డా :దేశగాని సాంబశివ గౌడ్, డా :రాస వెంకట్ ముదిరాజ్, డా: బొమ్మ హన్మంత్ రావ్, అల్లుడు జగన్ ముదిరాజ్ పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మానికి మ‌ద్ద‌తుగా  తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్, ఆళ్ళ రామకృష్ణ, బొల్లం లింగ మూర్తి పటేల్, శ్రీ రాంగౌడ్, సుంకరి పోతురాజ్ ముదిరాజ్, తోటం సత్యం, బిక్షపతి, పెంట అజయ్, తదితర నాయకులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *