గవర్నర్‌కు చేరిన ఆర్డినెన్స్ ‌ముసాయిదా

~ స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై15: స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల కోసం రూపొందించిన ఆర్డినెన్స్ ‌ముసాయి దా రాజ్‌భవన్‌కు చేరింది. ఇటీవలే కేబినేట్‌ ఆమోదించిన రిజర్వేషన్‌ ‌బిల్లుకు ఆర్డినెన్స్ ‌తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్ర మంలో పంచాయతీరాజ్‌ ‌చట్టంలో సవరణల ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌కు పంపించింది. పంచాయతీరాజ్‌ ‌చట్టం 2018లోని సెక్షన్‌ 285 ‌క్లాజ్‌-ఎ ‌సవరించాలని ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయిం చింది. ఆ సెక్షన్‌లో స్థానిక సంస్థల్లో 50 శాతానికి మించకుండా రిజర్వేషన్లు అమలవుతాయని ఉంది. అందులో 50శాతానికి మించకుండా అనే వాక్యాన్ని తొలగిస్తూ సవరించాలని నిర్ణయించారు. పంచాయతీల రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు హైకోర్టు విధించిన గడువు సపిస్తున్నందున.. ఆర్డినెన్స్ ‌ద్వారా చట్టసవరణ అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పంచాయతీ రా జ్‌ ‌శాఖ ఈ ఫైలును న్యాయశాఖ ఆమోదిం చిన తర్వాత మంత్రి, సీఎం ఆమోదంతో ప్రభుత్వం రాజ్‌భవన్‌కు ముసాయిదాగా పంపించింది. గవర్నర్‌ ఆమోదం పొందితే చట్టసవరణ అమల్లోకి రానుంది. దీనికి అనుగుణంగా డెడికే-టె-డ్‌ ‌కమిషన్‌ ‌స్థానిక సంస్థలకు రిజర్వేషన్లను సిఫార్సు చేయనుం ది. వాటి ఆధారంగా ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేసి రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపించనుంది. పంచాయతీ ఎన్నికలను సెప్టెంబరు 30 నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు గడువు విధించిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *