రిజ‌ర్వేష‌న్లు అమ‌ల‌య్యే వ‌ర‌కు బీసీ ఉద్య‌మం

– జాతీయ సెమినార్ లో 12మంది ఎంపీల పిలుపు
– క్రీమీలేయ‌ర్ నిబంధ‌న తొల‌గించాలి

న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 10ః చ‌ట్ట‌ సభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు అమలయ్యేవరకు బీసీ ఉద్యమం కొనసాగించాలని వివిధ పార్టీలకు చెందిన 12 మంది పార్లమెంట్ సభ్యులు పిలుపునిచ్చారు. న్యూదిల్లీలోని తెలంగాణ భవన్ అంబేద్కర్ ఆడిటోరియంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీల హక్కులపై జాతీయ సెమినార్ జరిగింది. వివిధ రాష్ట్రాల నుండి మేధావులు, ఉద్యమకారులు, బీసీ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సభకు తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్ట‌ర్ వకుళాభరణం కృష్ణమోహన్ అధ్యక్షత వహించగా, జాతీయ బీసీ సంక్షేమ సంఘం కో ఆర్డినేటర్ డాక్ట‌ర్ ర్యాగ‌ అరుణ్‌కుమార్, జాతీయ కార్యదర్శి బాణాల అజయ్‌కుమార్ సమన్వయం చేశారు. పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు, వద్దిరాజు రవిచంద్ర, అంబికా, లక్ష్మీనారాయణ, బీద మస్తాన్‌రావు, పాక సత్యనారాయణ తదితరులు పాల్గొని బీసీ హక్కులపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. జనాభా గణనలో కుల గణన చేపట్టాలని నిర్ణయించినందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కృతజ్ఞతలు తెలిపారు. బీసీలకు రాజ్యాంగబద్ధ హక్కులు, ముఖ్యమైన విధాన మార్పులు మోదీ నాయకత్వంలోనే సాధ్యమవుతాయని నమ్మకం వ్యక్తం చేశారు. కుల గణన వివరాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో బీసీలకు తగిన వాటా లభిస్తుందని పేర్కొన్నారు. ప్రపంచంలో అగ్రదేశంగా ఎదుగుతున్న భారత్‌లో బీసీల భవిష్యత్తు మరింత బలపడుతుందన్నారు. చరిత్రలో తొలిసారి కుల గణన నిర్ణయం తీసుకున్నందుకు ప్రధానమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు.. అసెంబ్లీ–పార్లమెంట్ ఎన్నికల్లో 50% బీసీ రిజర్వేషన్లు కల్పించేలా బీసీ బిల్లు తీసుకురావాలి.. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసి ₹2 లక్షల కోట్లతో ప్రత్యేక అభివృద్ధి పథకం అమలు చేయాలి.. విద్య/ఉద్యోగ రిజర్వేషన్లు 25% నుండి 50%కి పెంచాలి.. ప్రమోషన్‌లలో బీసీ రిజర్వేషన్లు అమలు చేయడానికి రాజ్యాంగ సవరణ చేయాలి.. బీసీలకు ఉన్న క్రీమీ లేయర్ నిబంధన తొలగించాలి.. పారిశ్రామిక విధానంలో 50% బీసీ కోటా అమలు చేయాలి.. హైకోర్టు–సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజ‌ర్వేషన్లు అమలు చేయాలి.. ప్రైవేట్ రంగంలో కూడా ఆ రిజర్వేషన్లు అమలు చేయాలి.. స్థానిక సంస్థల రిజర్వేషన్లు బీసీల జనాభా మేరకు పెంచాలి… దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో రెండు బీసీ నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేయాలి.. పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలను పూర్తిగా అమలు చేయాలి.. బీసీల ఆర్థిక అభివృద్ధి కోసం బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలి..ఎస్సీ, ఎస్టీ యాక్టుల మాదిరి బీసీల హక్కుల కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలి.. అనే తీర్మానాలు చేశారు. గుజ్జా స‌త్యం, నీలా వెంకటేష్, అనంతయ్య, ఆది మల్లేశం, మనోజ్ గౌడ్, శ్రీమన్, జక్కన్ సంజయ్, శ్రీనివాస్, శివకుమార్ యాదవ్, వేణు యాదవ్, కిషోర్, లక్ష్మీప్రసన్న, ప్రియాంక, స్వరూప, పద్మా, పరశురాం, చండిక గౌడ్, వసంత గౌడ్, రాజకుమారి తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *