– మంత్రి సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 18: రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న బీసీ బంద్‌ను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క ప్రజాభవన్‌లో పర్యవేక్షించారు. ఆమెతోపాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, సాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి కూడా ఉన్నారు. అనంతరం ట్యాంక్‌బండ్‌పై అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకున్న మంత్రులు సీతక్క, ప్రభాకర్, శ్రీహరి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, సాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి, ఇతర నేతలతో కలిసి బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం నిర్వహించిన ప్రదర్శనలో పాల్గొన్నారు.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన నేతలు జై బీసీ, బీసీల ఐక్యత వర్ధిల్లాలి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధిద్దాం అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ఉద్దేశంతో ఈరోజు బీసీ బంద్ నిర్వహిస్తున్నామని తెలిపారు. స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేసినందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. బీసీ రిజర్వేషన్ల కోసం తమ ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, అందుకే ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి కులగణన ప్రక్రియను ఎక్కడా లోపం లేకుండా పూర్తి చేశామని చెప్పారు. బీసీ రిజర్వేషన్ల పెంపు కోరుతూ అసెంబ్లీలో బిల్లును ఆమోదించాం కానీ ఆ బిల్లు ఆరు నెలలుగా కేంద్రం వద్ద పెండిరగ్‌లో ఉందని తెలిపారు. బీజేపీ రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తోందని, రాష్ట్రంలోని బీజేపీ నేతలు బీసీ రిజర్వేషన్లకు మద్దతిస్తామంటారు.. కానీ దిల్లీలో వారి పెద్దలు ‘నో’ అంటారు అని విమర్శించారు. బీసీ అని చెప్పుకునే ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ బీసీ బిల్లుకు వెంటనే ఆమోదం తెలపాలని సీతక్క డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో బీజేపీి, బీఆర్‌ఎస్ నేతలకు మాట్లాడే నైతిక హక్కు లేదని, కులగణనలో పాల్గొనని వారు బీసీల హక్కులపై మాట్లాడడం హాస్యాస్పదమంటూ వారికి ప్రజలే సమాధానం చెబుతారు అని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





