ట్యాంక్‌బండ్‌పై ఘనంగా సద్దుల బతుకమ్మ

– ఆకట్టుకున్న మహిళల బతుకమ్మ ప్రదర్శన
– హాజరైన మంత్రులు కొండా సురేఖ, పొన్నం తదితరులు

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 30: ‌సద్దుల బతుకమ్మ వవేడుకలు ఘనంగా జరిగాయి.  బతుకమ్మ పండుగ చివరి రోజు కావడంతో.. భాగ్యనగరం అంగరంగ వైభవంగా ముస్తాబైంది. ఈ నేపథ్యంలో ట్యాంక్‌బండ్‌పై నిర్వహిస్తున్న బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంట్టాయి. మహిళలు రంగురంగుల పువ్వులతో బతుకమ్మలను అందంగా అలంకరించారు. బతుకమ్మ చుట్టూ.. చప్పట్లు కొడుతూ, పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ సందడి చేశారు. తొమ్మిది రోజులు జరిగే… బతుకమ్మ పండుగలో రోజుకో ప్రత్యేకత ఉంటుంది. సంస్క•తి సాంప్రదాయాలకు పట్టుకొమ్మగా నిలిచే బతకమ్మ పండుగలో మంగళవారం చివరి ఘట్టమైన సద్దుల బతుకమ్మ. ఈ బతుకమ్మ పండుగ స్త్రీ అస్తిత్వానికి ప్రతీకగా నిలుస్తుంది. ఈ క్రమంలో  బతుకమ్మ వేడుకల ముగింపు కార్యక్రమం హైదరాబాద్‌ ‌ట్యాంక్‌ ‌బండ్‌పై ఘనంగా జరిగింది. అమర వీరుల స్మారకం నుంచి ట్యాంక్‌ ‌బండ్‌ ‌వద్ద బతుకమ్మ ఘాట్‌ ‌వరకు దాదాపు 700 బతుకమ్మలతో మహిళలు ప్రదర్శన నిర్వహించారు. మంత్రి కొండా సురేఖ, టూరిజం కార్పొరేషన్‌ ఎం‌డీ క్రాంతి,  సంగీత నాటక అకాడ ఛైర్మన్‌ అలేఖ్య పుంజాల, మహిళా కమిషన్‌ ‌ఛైర్‌పర్సన్‌ ‌నేరెళ్ల శారధ, హైదరాబాద్‌ ‌కలెక్టర్‌ ‌హరిచందన,  సాంస్క•తిక సారధి ఛైర్‌పర్సన్‌ ‌విమలక్క, డిప్యూటీ మేయర్‌ శ్రీ‌లత తదితరులు.. బతుకమ్మ పాటలకు మహిళలతో కలిసి నృత్యం చేశారు. పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఎం‌పీ అనిల్‌ ‌కుమార్‌ ‌యాదవ్‌ ‌తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు. వేడుకల్లో భాగంగా సచివాలయంపై  3డీ మ్యాప్‌ ‌లేజర్‌ ‌షో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ… బతుకమ్మ వేడుకలకు గిన్నిస్‌ ‌రికార్డులు వచ్చేలా ప్రభుత్వం కృషి చేసిందన్నారు. కొంతమంది గతంలో బతుకమ్మ వేడుకల్లో డిస్కో డ్యాన్స్‌లు ఆడేవాళ్లు. డిస్కో డ్యాన్స్‌ల సంప్రదాయం ఇప్పుడు లేదు. పూర్వీకులు మనకు అందించిన సంప్రదాయాలను కొనసాగిద్దాం అని పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *