హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 11: మహిళలను దీర్ఘకాలంగా ఇబ్బంది పెడుతున్న క్రమరహిత హృదయ స్పందన సమస్యకు వినూత్న చికిత్సతో ఉపశమనం లభించింది. దేశంలో ఆధునిక హృదయ చికిత్సలో ముందంజలో ఉన్న బంజారాహిల్స్ కేర్ హాస్పిటల్స్ మరో మైలురాయిని సాధించింది. తాజాగా ప్రారంభమైన క్యూ డాట్ టెక్నాలజీ సహాయంతో ఆట్రియల్ ఫైబ్రిలేషన్ అబ్లేషన్ (గుండె వేగంగా లేదా అసమానంగా కొట్టుకోవడం సమస్యను సరిచేయడానికి చేసే చికిత్స) శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ అత్యాధునిక ఎలక్ట్రోఫిజియాలజీ పద్ధతిని ఉపయోగించిన దేశంలోని తొలి హాస్పిటల్స్‌లో కేర్ హాస్పిటల్స్ ఒకటిగా నిలిచింది. ఈ చికిత్సను 57 ఏళ్ల మహిళకు విజయవంతంగా నిర్వహించారు. ఆమెకు నిరంతర గుండె దడ (కర్ణిక దడ), బయాట్రియల్ కార్డియోమయోపతి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం ఆమె బంజారాహిల్స్‌లోని కేర్ హాస్పిటల్స్‌లో రీజినల్ క్లినికల్ డైరెక్టర్, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎం.శ్రీనివాసరావు పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. శస్త్రచికిత్స తర్వాత పూర్తిగా స్థిరంగా ఉండి, గుండె లయ సాధారణ స్థాయిలో కొనసాగుతోంది. క్యూ డాట్ అనేది కాథెటర్ అబ్లేషన్ టెక్నాలజీలో తాజా పురోగతి. ఇది అధిక శక్తిని తక్కువ సమయంలో ఖచ్చితంగా ఉష్ణోగ్రత నియంత్రణతో అందించే విధంగా రూపొందించబడింది. దీని వల్ల ఎలక్ట్రోఫిజియాలజీ నిపుణులు క్లిష్టమైన ఎట్రియల్ ఫైబ్రిలేషన్ చికిత్సలను తక్కువ సమయంలో పూర్తిచేయగలరు. అదే సమయంలో రోగి భద్రత మెరుగవుతుంది. అలాగే ఎక్కువసేపు అనస్థీషియా లేదా రేడియేషన్‌కు గురికావడం వల్ల వచ్చే ఇబ్బందులు తగ్గుతాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




