– దేశానికి గౌరవం తెచ్చన ఘనత నాది
– నిజాలు తెలుసుకోకుండా విమర్శలా: మంత్రి అజారుద్దీన్
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 1: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి క్రికెట్ గురించి ఏం తెలుసని మంత్రి అజారుద్దీన్ ప్రశ్నించారు. ఆయనకు బ్యాట్ పట్టుకోవడం కూడా రాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనను విమర్శించే వాళ్లకి సమాధానం చెప్పి తన స్థాయి తగ్గించుకోలేనని చెప్పుకొచ్చారు. తనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ క్రికెటర్, మంత్రి అజారుద్దీన్ స్పందించారు. శనివారం ఆయన తనను కలిసిన విలేఖర్లతో మంత్రి మాట్లాడుతూ తనపై వొచ్చిన ఆరోపణలపై కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని గుర్తుచేశారు. ఇది ఎవరైనా తెలుసుకోవాలన్నరు. విమర్శలు చేయడం కాదు..నిజాలు కూడా తెలుసుకోవాలన్నారు. దేశ గొప్పతనాన్ని ప్రపంపచానికి చాటిన తాను దేశ ద్రోహినా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల కోసమే బీజేపీ తనను టార్గెట్ చేసిందని ఆరోపించారు. మంత్రిగా జూబ్లీహిల్స్‌లో అడుగుపెట్టిన తనను ప్రజలు ఆదరించారని.. ఇందుకు ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. విమర్శించిన వాళ్ళకి సమాధానం చెప్పదల్చుకోలేదని మంత్రి అజారుద్దీన్ స్పష్టం చేశారు. కాగా.. అజారుద్దీన్‌పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అజారుద్దీన్ దేశ ద్రోహానికి పాల్పడ్డారని, భారత్‌కు చెడ్డపేరు తెచ్చారని విమర్శించారు. ఆయనపై అనేక కేసులు ఉన్నాయని.. అలాంటి వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి ఇవ్వడం ప్రజాస్వామ్యానికి అవమాన కరమన్నారు. అజారుద్దీన్ దేశ గౌరవానికి భంగం కలిగించారంటూ కిషన్ రెడ్డి చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




