prajatantra_news

prajatantra_news

కలుషిత ఆహారం పెట్టారంటూ విద్యార్థుల ఆందోళన

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23: రాష్ట్రంలో ప్రభుత్వ గురుకుల, ఆశ్రమ పాఠశాలల పరిస్థితితులు రోజురోజుకు దిగజారుతున్నాయి. నాణ్యత లేని, కలుషిత ఆహారం పెడుతున్నారని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తరచుగా జరుగుతున్న ఫుడ్‌ ‌పాయిజన్‌ ‌ఘటనలతో వందలాదిమంది విద్యార్థినులు అస్వస్థతకు గురై దవాఖానల పాలవుతున్నారు. ఇటీవలే నాగర్‌కర్నూల్‌ ‌సంఘటన మరవకముందే జనగామ జిల్లా పాలకుర్తి…

కేజీబీవీ బెడ్స్ ‌టెండర్లలో రూ.100 కోట్ల కుంభకోణం

– లోకాయుక్తలో బీఆర్‌ఎస్‌వీ నేత గెల్లు ఫిర్యాదు ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23:కేజీబీవీ బంకర్‌ ‌బెడ్స్ టెండర్లలో జరిగిన రూ.100 కోట్ల కుంభకోణంపై వెంటనే సీబీఐ విచారణ జరపాలని బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ ‌యాదవ్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. దీనిపై లోకాయుక్తలో సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుంభకోణం విషయంలో…

లోయలో పడ్డ బస్సు: 18మంది మృతి

ఖాట్మండ్, ఫిబ్రవరి 23: నేపాల్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ధాడింగ్ జిల్లాలో ఓ ప్రయాణికుల బస్సు లోయలో పడి 18మంది మృతిచెందారు. మరో 28మంది గాయపడ్డారు. పొఖారా నుంచి కాఠ్‌మాండూ వెళ్తుండగా సోమవారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరిగింది. బస్సు అదుపుతప్పి త్రిశూలీ నదిలోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో 45 Tందికి పైగా ప్రయాణికులు…

అంతర్జాతీయ మహిళా దినోత్సవ పోస్టర్ ఆవిష్కరణ

– మార్చి 6న వేడుకలకు మంత్రి సీతక్కకు ఆహ్వానం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23: తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం-2026 కార్యక్రమానికి సంబంధించి రూపొందించిన పోస్టర్‌ను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) సోమవారం ఆవిష్కరించారు. ఈ…

బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం

– పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం – హైదరాబాద్‌లో పలుచోట్ల మోస్తరు వర్షం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 23: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో భాగ్యనగరంలో పలుచోట్ల వర్షం కురిసింది. సోమవారం మధ్యాహ్నం వరకు భానుడు తన ప్రతాపం చూపినప్పటికీ మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆకాశం మబ్బుపట్టి చల్లని గాలులు వీచడంతో నగరంలో…

చిన్న కాంట్రాక్ట‌ర్ల‌కు బిల్లులు చెల్లించాలి

– బిల్లులు రాక‌ ‘మన ఊరు – మన బడి’ కాంట్రాక్టర్ల ఇబ్బందులు – క‌మీష‌న్ల కోసం బ‌డా కాంట్రాక్ట‌ర్ల‌కు బిల్లుల చెల్లింపు – చిన్న కాంట్రాక్ట‌ర్ల‌ను ప‌ట్టించుకునే నాథుడు లేడు – రెండున్న‌రేళ్లుగా 1500మందికి చెల్లింపులు బంద్‌ – అడిగితే పోలీసు కేసులు – హ‌రీష్‌రావు డిమాండ్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 23: కేసీఆర్‌…

నా పేరుతో ఎలాంటి సంస్థలు లేవు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23: తన పేరుతో ఎలాంటి సంస్థలు లేవని, అలా సంస్థలు స్థాపించి కార్యకలాపాలు నిర్వహించేందుకు ఎలాంటి అనుమతులు లేవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. కొంతమంది ’కేటీఆర్ సేవా సమితి’, ’కేటీఆర్ సేన’ లాంటి పేర్లతో సంస్థలను ఏర్పాటు చేసి కార్యకలాపాలు చేపడుతున్నట్లు…

జంట జలాశయాల్లో కాలుష్యంపై విచారణ

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23: హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాల కాలుష్యంపై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ జలాశయాల్లో మురుగు, పరిశ్రమల వ్యర్థాలు చేరి నీళ్లు కలుషితమవుతున్నాయంటూ ఓ వార్తాపత్రికలో వచ్చిన కథనాన్ని సుమోటోగా తీసుకున్న సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది. తాగునీటి జలాశయాల్లో వ్యర్థాలు చేరడంపై ఉన్నత న్యాయస్థానం జలమండలిని ప్రశ్నించింది. జలమండలి, పొల్యూషన్…

హౌసింగ్‌ ‌బోర్డు భూముల ధ‌ర‌ల‌కు రెక్కలు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఫిబ్ర‌వ‌రి 23:హైదరాబాద్‌ ‌నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న హౌసింగ్‌ ‌బోర్డు భూములు అధిక ధరలు పలికాయి. గచ్చిబౌలి, భౌరంపేట్‌, ‌బాలాజీ నగర్‌, ‌చింతల్‌ ‌తదితర ప్రాంతాల్లోని మొత్తం 14 స్థలాలను బహిరంగ వేలం వేశారు. వీటిలో గచ్చిబౌలిలోని భూమి చదరపు గజం రూ.1.76 లక్షలు, కూకట్‌పల్లి బాలాజీ నగర్‌లో చదరపు గజం రూ.1.64 లక్షలు పలికింది.…

టీజీ ఎడ్‌సెట్‌ ‌నోటిఫికేషన్‌ ‌విడుదల

– 23నుంచి ఏప్రిల్‌ 15 ‌వరకు దరఖాస్తులకు అవకాశం – మే 12న రాష్ట్రవ్యాప్తంగా ప్రవేశ పరీక్ష హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23: రాష్ట్రంలోని బీఈడీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రతిష్టాత్మక టిజి ఎడ్‌సెట్‌-2026 ‌నోటిఫికేషన్‌ను వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీ అధికారులు విడుదల చేశారు. ఈ ఏడాది పరీక్ష నిర్వహణ బాధ్యతలను స్వీకరించిన కేయూ,…