prajatantra_news

prajatantra_news

దిల్లీ ఎయిర్‌ పోర్టులో సాంకేతిక సమస్య

– విమానాల రాకపోకలకు అంతరాయం న్యూదిల్లీ, నవంబర్‌ 7: దేశ రాజధాని దిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం సాంకేతిక సమస్య తలెత్తింది. ఎయిర్‌పోర్టులోని ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ వ్యవస్థలో సాంకేతికలోపం తలెత్తడంతో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. దీని కారణంగా దాదాపు 100కు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు…

వందేమాతర గీతం జాతీయవాద జ్వాలను రగిలిస్తోంది

– కేంద్ర మంత్రి అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు న్యూదిల్లీ,నవంబర్‌7: వందేమాతరం గేయానికి 150 ఏళ్లు నిండాయి. స్వాతంత్య్రోద్యమంలో ఆ గేయం ప్రజల్లో ఎంతో స్పూర్తి నింపింది. అయితే ఆ గేయం దేశ ప్రజల్లో ఇప్పటికీ నిరంతరం జాతీయవాద జ్వాలను రగిలిస్తోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా అన్నారు. దేశ ఐక్యత, దేశభక్తి, యువతలో…

మోదీ గొప్ప వ్యక్తి , నా మిత్రుడు

– 2026లో భారత్‌లో పర్యటిస్తా – వాణిజ్య సంబంధాలను పటిష్టం చేస్తా – డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు న్యూదిల్లీ,నవంబర్‌7: అమెరికా- భారత్‌ మధ్య టారిఫ్‌ ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ గొప్ప వ్యక్తి, తన మిత్రుడు అంటూ…

దేశ గౌరవం, సమగ్రతకు పునరంకితమ‌వుదాం

– వందేమాతరం గీతం ఉత్సవంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పిలుపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 7: వందేమాతరం గీతాన్ని రచించి నేటికి సరిగ్గా 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ చారిత్రక సమయంలో అందరం మన ఆత్మగౌరవం, దేశ గౌరవం, సమగ్రత కోసం పునరంకితం కావాల్సిన అవసరం ఉందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి…

డిసెంబర్‌లో ఇంటర్నేషనల్‌ షార్టు ఫిలిం ఫెస్టివల్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 7: తెలంగాణ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్‌ షార్ట్‌ ఫిలిం ఫెస్టివల్‌ నిర్వహించనున్నట్లు రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి తెలిపారు. డిసెంబర్‌ 19 నుండి 21వ తేదీ వరకు దాదాసాహెబ్‌ ఫాల్కే స్కూల్‌ ఆఫ్‌ ఫిలిం స్టడీ సంస్థ ద్వారా ఈ కార్యక్రమం…

స్వాతంత్య్రోద్యమానికి ప్రేరేపించిన గీతం వందేమాతరం

– మంత్రి పొన్నం ప్రభాకర్‌ – మహబూబియా గర్ల్స్‌ హైస్కూలులో 150 సంవత్సరాల వేడుకలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 7: బంకించంద్ర ఛటర్జీ రాసిన వందేమాతరం గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అబిడ్స్‌ మహబూబియా గర్ల్స్‌ హైస్కూల్‌లో శుక్రవారం వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న బీసీ సంక్షేమం, రవాణా శాఖల మంత్రి…

నిష్పక్షపాతంగా వ్యవహరించని అధికారులు

– కాంగ్రెస్‌-బీఆర్‌ఎస్‌లకు కొమ్ముకాస్తున్నారు ~బీజేపీ స‌భ‌కు ముందుగా అనుమ‌తి కోరినా నిరాక‌ర‌ణ‌ – మాంగటి గోపీనాథ్‌ మృతిపై విచారణ జరిపించాల్సిందే – రేవంత్‌, కేటీఆర్‌ మధ్య గోపీనాథ్‌ ఆస్తుల వ్యవహారం – మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి బండి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 7: ఎన్నికల కమిషన్‌, పోలీసు అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని, కాంగ్రెస్‌,…

వడ్డెరలకు అండగా ఉండేది కాంగ్రెస్సే

– పని ప్రాంతాల్లో ప్రమాదాలకు గురైతే పరిహారం – బోరబండలో వడ్డెర్ల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 7: రక్తం చెమటగా చిందించి రాళ్లను కరిగించి పటిష్టమైన నిర్మాణాలు చేసిన వడ్డెర్లు హైదరాబాద్‌ నగర అభివృద్ధికి వెన్నెముకలని, పీజేఆర్‌ హయాంలో వడ్డెర్లకు ఇండ్ల పట్టాలు ఇచ్చారని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి…

డిప్యూటీ సీఎం భట్టిని కలుసుకున్న క్రికెటర్‌ అరుంధతి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 7: ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను క్రికెట్‌ ప్లేయర్‌ అరుంధతి రెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఇటీవల జరిగిన ఉమెన్‌ వరల్డ్‌ కప్‌ -2025 పోటీలలో భారత జట్టు విజేతగా నిలవడంలో ఆమె తనదైన పాత్ర పోషించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి క్రికెటర్‌ అరుంధతి రెడ్డిని సన్మానించారు. కార్యక్రమంలో…

ఫుట్‌బాల్‌ క్రీడాభివృద్ధికి సేవలందించాలి

– ప్రముఖ కోచ్‌ రిచర్డ్‌ను కోరిన మంత్రి శ్రీహరి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 7: క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరిని పముఖ ఫుట్‌బాల్‌ కోచ్‌ రిచర్డ్‌ అలెన్‌ శనివారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఫుట్‌బాల్‌ అభివృద్ధి కోసం పలు హోదాల్లో రిచర్డ్‌ అలెన్‌ పని చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీహరి రిచర్డ్‌…