prajatantra_news

prajatantra_news

రవి హార్డ్ ‌డిస్క్‌లో 21వేలకు పైగా సినిమాలు

– బెట్టింగ్‌ ‌యాప్స్‌ను ప్రమోట్‌ ‌చేసేలా పైరసీ – పైరసీ ద్వారా రూ.20కోట్లు సంపాదించిన రవి – రూ.3 కోట్లు అకౌంట్‌లో ఫ్రీజ్‌ ‌చేశామన్న సిపి సజ్జన్నార్‌ – కమిషనర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన సినీ పెద్దలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 17: ‌పైరసీతో సినీ పరిశ్రమకు భారీ నష్టం కలిగిందని నగర పోలీస్‌ ‌కమిషనర్‌…

ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌ అధిరోహించిన వరంగల్‌ జంట

వరంగల్‌, ప్రజాతంత్ర ప్రతినిధి, నవంబర్‌ 17: హిమాలయాల్లోని అత్యంత ఎత్తైన ఈ బేస్‌ క్యాంప్‌ను ఇటీవల అధిరోహించిన 16 మంది బృందంలో వరంగల్‌ జంట ఒకటి. హనుమకొండ బ్రాహ్మణ వీధికి చెందిన దహగం శ్రీకాంత్‌, శారద దంపతులు తమ 55 ఏండ్ల వయస్సులో 5,364 మీటర్ల ఎత్తులోని బేస్‌ క్యాంప్‌నకు సునాయాసంగా చేరుకున్నారు. బేస్‌ క్యాంప్‌…

పెన్షనర్లను చంపకండి- బతకనీయండి

రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ వెంటనే చెల్లించండి – ప్రొఫెసర్‌ కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ సుధాకర్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 17: రిటైర్‌ అయిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు మార్చి 2024 నుండి అక్టోబర్‌ 2025 వరకు రిటైర్మెంట్‌ బకాయిలు చెల్లించనందుకు నిరసనగా హైదరాబాదులోని ధర్నా చౌక్‌లో ప్రభుత్వ పెన్షనర్ల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం మహా…

అందెశ్రీ సంతాప సభను ఘనంగా నిర్వహిద్దాం

– దళితులు, కవులు, కళాకారులు, ప్రజాసంఘా ఒకే వేదికపైకి రావాలి – ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 17: రాష్ట్ర గీత రచయిత, ప్రముఖ కవి అందెశ్రీ సంతాప సభను రాష్ట్ర గౌరవానికి తగ్గట్టు, తెలంగాణ ఆత్మను ప్రతిబింబించేలా నిర్వహించాలి అని ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ…

అంగన్‌వాడీ చిన్నారులకు విజయ పాలు

– దేశంలోనే తొలిసారి – పైలట్‌ ప్రాజెక్టుగా ములుగు జిల్లా – మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ములుగు, ప్రజాతంత్ర, నవంబర్‌ 17: రాష్ట్రంలోనే తొలిసారిగా ములుగు జిల్లా కేంద్రంలోని కృష్ణా కాలనీ అంగన్‌వాడీ కేంద్రంలో పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా ప్రీ స్కూల్‌ చిన్నారులకు 100 మి.లీ విజయ పాలను రోజూ అందించే…

పత్తి కొనుగోళ్లపై ప్రతిష్టంభన

– ఎనుమాముల మార్కెట్‌లో నిలిచిన కొనుగోళ్లు – కేంద్ర, రాష్ట్రాలది మొద్దు నిద్ర : కేటీఆర్‌, గండ్ర విమర్శలు వరంగల్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 17: వరంగల్‌ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి కొనుగోళ్లపై తీవ్ర గందరగోళం నెలకొంది. కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) తీరుపై రైతులు, జిన్నింగ్‌ మిల్లర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీసీఐ…

ప్రధాని మోదీ సంతాపం

న్యూదిల్లీ, నవంబర్‌ 17: సౌదీలో జరిగిన దుర్ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు తన సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక ప్రకనటలో పేర్కొన్నారు. రియాద్‌లోని రాయబార కార్యాలయం, జెడ్డాలోని కాన్సులేట్‌ సాధ్యమైనంత సహాయం అందిస్తున్నాయని, భారత అధికారులు సౌదీ అధికారులతో సన్నిహితంగా ఉన్నారని తెలిపారు. గాయపడినవారు త్వరగా…

సౌదీ ప్రమాదంలో 45 మంది మృత్యువాత

– బతికి బయటపడ్డ ఒకే ఒక్కడు – మృతులంతా హైదరాబాద్‌ పాత బస్తీ వాసులు హైదరాబాద్‌, నవంబర్‌ 17: సౌదీ అరేబియాలో జరిగిన విషాద ఘటనలో 45 మంది హైదరాబాదీలు మృతిచెందారు. ఉమ్రా యాత్రికులతో వెళ్తోన్న బస్సు డీజిల్‌ ట్యాంకర్‌ను ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. సోమవారం తెల్లవారుజామున(భారత కాలమానం ప్రకారం) 1.30…

సౌదీలో ప్రమాదంపై డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 17: సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఉమ్రా యాత్రికులు మృతిచెందడంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల్లో హైదరాబాద్‌ వాసులు ఉన్నారని సమాచారం తెలుసుకొని సౌదీ అరేబియాలో ఉన్న ఎన్నారై కాంగ్రెస్‌ నేతలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వెంటనే సహాయక…