deccan.com

deccan.com

ట్రిలియన్ డాలర్ జిడిపి ఆర్థిక వ్యవస్థగా… తెలంగాణ‌ను తీర్చిదిద్దుతున్నాం..

దేశ ప్రగతిలో రైల్వేలు  ఎంతో కీలకం హైదరాబాద్ -బందర్ పోర్ట్ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి స‌హ‌క‌రించండి.. రాష్ట్రంలో 370 కి.మీ రీజనల్ రింగ్ రోడ్  నిర్మాణం చర్లపల్లిలో కొత్త టెర్మినల్ అభివృద్ధి చేసినందుకు కృతజ్ఞతలు: ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 6 : దేశ ప్ర‌గ‌తిలో రైల్వే అభివృద్ధి ఎంతో కీల‌క‌మ‌ని…

హైదరాబాద్ అభివృద్ధికి ఎవరితోనైనా క‌లిసి ప‌నిచేస్తాం.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  

ఆరాంఘర్- జూపార్కు ఫ్లైఓవర్ ప్రారంభించిన సీఎం హైదరాబాద్ అభివృద్ధికి ఎవరితో కలిసి పనిచేయడానికైనా తాము సిద్ధమ‌ని, అవ‌స‌ర‌మైతే ఎంఐఎంను కలుపుకుని ముందుకు వెళతామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సోమ‌వారం ఆరాంఘర్-జూపార్క్ ఫ్లైఓవర్ ను  సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. వైఎస్ హయాంలో అతి పెద్ద ఫ్లైఓవర్ పీవీ ఎక్స్‌ప్రెస్ వే…

ఛత్తీస్‌గ‌ఢ్‌లో భారీ మందుపాతర పేల్చిన మావోయిస్టులు

తునాతునక‌లైన‌ జవాన్‌ల వాహనం ఒక డ్రైవర్‌తో సహా 8 మంది జవాన్లు మృతి మరో ఆరుగురికి తీవ్రగాయాలు.. బీజాపూర్‌ హాస్పిటల్‌కు  తరలింపు భద్రాచలం, ప్రజాతంత్ర, జనవరి  6 : తెలంగాణకు సరిహద్దున ఉన్న ఛత్తీస్‌గ‌ఢ్‌ ‌రాష్ట్రంలోని బీజాపూర్‌ ‌జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జవాన్‌ల వాహనాన్ని లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఐఇడి మందుపాతర పేలి ఒక…

న్యూ ఎనర్జీ పాలసీ

దేశ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు దోహదం మిగులు విద్యుత్‌తో దేశానికి ఆదర్శంగా తెలంగాణ 2030 నాటికి 22,448 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి బిఆర్ఎస్ దుష్ప్రచారాన్ని నమ్మని ప్రజలు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 6 :  దేశ, విదేశీ పెట్టుబడులు…

కేటీఆర్‌కు మరోసారి ఏసీబీ నోటీసులు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 6 : ‌బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌కు మరోసారి ఏసీబీ నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. విచారణకు రాకపోవడంతో మళ్లీ నోటీసులు ఇవ్వాలని ఏసీబీ నిర్ణయించినట్లు సమాచారం. నోటీసులు ఇచ్చి విచారించాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. న్యాయవాది సమక్షంలో విచారణ చేయాలని కేటీఆర్‌ ‌కోరుతున్నారు. ఇప్పటికే కేటీఆర్‌ ‌క్వాష్‌ ‌పిటిషన్‌ ‌తీర్పును హైకోర్టు…

తెలంగాణలో రైల్వే నెట్ వర్క్ విస్తరణకు ప్రాధాన్యతనివ్వండి

ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌ మంత్రి శ్రీధర్ బాబు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర,  జ‌న‌వ‌రి 6 : భౌగోళికంగా ఉత్తర, దక్షణ ప్రాంతాలను కలుపుతున్న తెలంగాణ రాష్ట్రం రైల్వే కనెక్టివిటీలో మాత్రం పదో స్థానంలో ఉందని, జిల్లాలు, గ్రామాలను కలుపుతూ నెట్‌వర్క్ ను మరింత విస్తరించేందుకు కేంద్రం చొరవ చూపాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్…

రైల్వేలు రవాణా వ్యవస్థకు జీవనాడి

గత పదేళ్లుగా శరవేగంగా రైల్వేల అభివృద్ధి చర్లపల్లి రైల్వే టెర్మినల్ ఒక ట్రయల్ మాత్రమే. అసలు పండుగ ముందుంది.. చర్లపల్లి నుంచి ఎంఎంటీఎస్ రైళ్లు   రూ. 720 కోట్లతో సికింద్రాబాద్, రూ. 350 కోట్లతో నాంపల్లి రైల్వేస్టేషన్ల‌ అభివృద్ధి కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 6…

వికసిత భారత్ సంకల్పంలో రైల్వేల అభివృద్ధి కీలకం..

గుర్తుండిపోయే మధుర స్మృతిగా  రైలు ప్రయాణం ఇది కేవలం ప్రారంభం మాత్రమే.. దేశంలో త్వ‌ర‌లో మొదటి బుల్లెట్ రైలు 2014లో 4 నగరాల్లో మెట్రోలు.. ఇప్పుడు.. 17 నగరాల‌కు విస్త‌ర‌ణ‌ వేల సంఖ్యలో ఆర్వోబిలు, అండర్ బ్రిడ్జ్‌ల‌ నిర్మాణం   చ‌ర్ల‌ప‌ల్లి రైల్వే టెర్మిన‌ల్ ను వ‌ర్చువ‌ల్‌గా ప్రారంభించిన మోదీ హాజ‌రైన కేంద్ర రైల్వేశాఖ‌ మంత్రి…

కొలువుల తెలంగాణా’ కావాలి

కొలువుల కోసం “కాంగ్రెస్ “పై కోటి ఆశలతో నిరుద్యోగులు! మన దేశంలో మిగతా రాష్ట్రాలు భౌగోళికంగా ఏర్పడితే, తెలంగాణ ఒక భావోద్వేగా రాష్ట్రం,కదిలిస్తే ఇక్కడ అమరవీరుల తల్లుల కన్నీళ్లు కన్పిస్తాయి.నీళ్లు,నిధుల కోసం నాయకులు కొట్లాడితే కొలువులే కొలమానంగా తొలి నుండి తుది తెలంగాణ ఉద్యమంలో కొట్లాడింది విద్యార్థులే.తెలంగాణ వొస్తే కోరుకున్న కొలువు వొస్తదని,గొప్పగా బతుకుతాం అని విద్యార్థులు తమ జీవితాలని లెక్క చేయకుండా,ప్రాణాలని పణంగా పెడితే ఆ త్యాగల పునాదులపై తెలంగాణ పురుడుపోసుకున్నది.తెలంగాణ రాష్ట్రము ఏర్పడితే తొలి ఫలితం విద్యార్థులకే దక్కాలి,అది వారి హక్కు కూడా.కానీ ఈ పదేండ్లలో సొంత రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ విషయంలో నిరుద్యోగుల నిరాశ,అసంతృప్తి,అందోనళ నను ప్రభుత్వం అర్ధం చేసుకొవాలి.ప్రజా ప్రభుత్వం ఉద్యోగాల భర్తీనీ అత్యంత ప్రాధాన్యత అంశంగా పరిగణించి, ఉద్యోగాల భర్తీ వైపు అడుగులు పడాలని నిరుద్యోగులు ప్రజాప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోతో మళ్ళీ చిగురించిన ఆశలు? కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ఏర్పాటులో నిరుద్యోగులదే కీ రోల్ అని ప్రభుత్వ ఏర్పాటు తర్వాత కూడా ప్రభుత్వం గుర్తించడం నిజంగా గొప్ప విషయం,ఇది నిరుద్యోగుల గౌరవాన్ని పెంచింది.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే మాది నిరుద్యోగుల ప్రభుత్వం అని, మా ప్రజా ప్రభుత్వం నిరుద్యోగుల భాధలు,సమస్యలు వినడానికి సిద్ధంగా ఉన్నదని ప్రకటించడం అంటే ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై సీరియస్ గా ఉందనే విశ్వాసాన్ని నిరుద్యోగులకి కల్పించారు.కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టిన 2లక్షల ఉద్యోగాలు,జాబ్ క్యాలెండరు అనేది ఒక సంచలనం.పెండింగ్ లో ఉన్న ఉద్యోగాలని శరవేగంగా భర్తీ చేసి కొత్త సంవత్సరంలో పకడ్బoదిగ జాబ్ క్యాలెండరు అమలు చేసే దిశగా ప్రజా ప్రభుత్వం అడుగులు పడుతున్నాయి.టీజీపిఎస్సీ చైర్మన్ పదవి కాలం పూర్తి కాకముందే కొత్త ఛైర్మన్ ని నియమించడం మంచి పరిణామం.కోచింగ్ సెంటర్ల దోపిడీ నుండి గ్రామీణ పేద విద్యార్థలకీ విముక్తి కల్పించి, తల్లిదండ్రులకి లక్షల రూపాయల కోచింగ్ ఫీజు భారం తగ్గించేలా అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్ ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తాం అని ప్రభుత్వం ప్రకటించింది.ప్రస్తుత జాబ్ క్యాలెండర్ అమలుకు ముందే అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్లని ఏర్పాటు చేసి అనుభవజ్ఞ్యులైన అధ్యాపకుల చేత ఖరీదైనా కోచింగ్ ని ఉచితంగా అందించడంతో పాటు వసతి సౌకర్యం కల్పించాలి. నిరుద్యోగులకి ఇచ్చిన ప్రతి హామీని నిరవేర్చాలి? నిరుద్యోగుల బాధలను స్వయంగా చూడటానికి కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధి అశోక్ నగర్ వొచ్చి, నిరుద్యోగుల బాధలను కళ్లారా చూసి చలించిపోయి మా ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వొచ్చిన వెంటనే 2లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తుందని ఇది నా గ్యారెంటీ అని హామీ ఇవ్వడంతో, నిరుద్యోగులు ప్రజా ప్రభుత్వంపై పూర్తి విశ్వాసంతో మళ్ళీ పుస్తకాలని పట్టుకున్నారు.తమ జీవితం ఆగమైపోయిందని అనుకున్న నిరుద్యోగులలో జాబ్ క్యాలెండరు,2లక్షల ఉద్యోగాల హామీ ఆనందాన్ని ఇచ్చింది.యేండ్లకేండ్లు ఉద్యోగాల భర్తీ జరగకుండా, ఇచ్చిన ప్రతి నోటిఫికేషన్ కోర్ట్ మెట్లు ఎక్కకుండా, ఎటువంటి పొరపాట్లు లేకుండా, స్పష్టంగా జాబ్ క్యాలెండరులో పెట్టిన తేదీల ప్రకారం వేగంగా ఉద్యోగాలని భర్తీ చేయాలి.అదేవిధంగా నిరుద్యోగులకి ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగభృతి 4000 రూపాయలని వెంటనే ప్రభుత్వం అందివ్వాలి. ప్రభుత్వం తండ్రిలా నిరుద్యోగబిడ్డలకి గౌరవప్రదమైన జీవితం దక్కేలా భరోసా కల్పించడం అనేది ప్రభుత్వం బాధ్యత. అప్పులతో నిరుద్యోగుల జీవితాలని ముడిబెట్టడం న్యాయమేనా? నిరుద్యోగులంటే అంత చిన్నచూపా, అవమానకారంగా అప్పులతో నిరుద్యోగుల జీవితాలని తీసిపడేయడం ఇది ఏ విధంగా ప్రజా ప్రభుత్వ గౌరవాన్ని పెంచుతుంది. మేం ఎన్నో కలలు కన్నాం, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వొస్తే 2లక్షల ఉద్యోగాలని,జాబ్ క్యాలెండరు ద్వారా భర్తీ చేస్తుందని అనుకున్నాం.ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు 10యేండ్లు అధికారంలో లేరు తప్పకుండ వారికి మా బాధలు తెలుసు కాబట్టి ఉద్యోగాల భర్తీనే ప్రధాన ఎజెండాగా ప్రజా ప్రభుత్వం శరవేగంగా కొలువుల భర్తీ చేయాలనీ నిరుద్యోగులు ప్రభుత్వాన్ని ప్రార్ధిస్తున్నారు.అంతేకాని అప్పులతో నిరుద్యోగుల జీవితాలని ముడివేయడం నిజంగా బాధాకరం.ప్రస్తుతం ఉన్న అప్పులు గత ప్రభుత్వం చేసిన అప్పులే,అయినా అప్పటి ప్రభుత్వం మీద ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు అని ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు పోరాడారు కదా,కొట్లాడారు కదా?అప్పుడు మీరు అప్పులుతో ఉద్యోగాలని ఏందుకు ముదిపెట్టలేదు?మేనిఫెస్టోలో పెట్టిన రెండు లక్షల ఉద్యోగాలని భర్తీ చేయాలనీ నిరుద్యోగులంతా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. నిరుద్యోగమే లేని తెలంగాణ కోసం ప్రభుత్వం కృషి చేయాలి ఎప్పటికప్పుడు ఖాలీ అయ్యే ప్రతి ఉద్యోగాన్ని ముందు రోజు వరకే ఆ ఉద్యోగం భర్తీ అయ్యేలా ప్రభుత్వం కృషి చేయాలి.ప్రభుత్వ ఉద్యోగాలు పరిమితంగానే ఉంటాయి కాబట్టి ప్రభుత్వం ప్రయివేట్ ఉద్యోగాల భర్తీపై ప్రత్యేకంగా దృష్టిసారించాలి.తెలంగాణ బిడ్డలకి ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలకు ప్రభుత్వం రాయితీలని, ప్రోత్సహాకాలని అందించాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే నియామకాల కోసం కాబట్టి, ప్రయివేటు ఉద్యోగాలలో 75% ఉద్యోగాలు స్థానికులకి దక్కేలా ప్రభుత్వం చట్టం తీసుకురావాలి.పరిశ్రమలకి కావాల్సింది నైపుణ్యం ఉన్న మానవ వనరులే కాబట్టి పరిశ్రమలకి అవసరమయినా సాంకేతిక నైపుణ్యలని ప్రభుత్వమే అందివ్వాలి.పరిశ్రమలు కోరుకుంటున్న, పారిశ్రామిక అవసరాలు తీర్చేలా విద్య వ్యవస్థని మార్చాలి.అదేవిధంగా బిజినెస్ చేసుకునేందుకు తెలంగాణ బిడ్డలకి ఉదారంగా రుణాలు ప్రభుత్వం అందించినప్పుడే కొలువుల తెలంగాణ అవతరిస్తుంది. -:శ్రవణ్ కుమార్ నల్ల నిరుద్యోగి

కొలువుల కోసం “కాంగ్రెస్ “పై కోటి ఆశలతో నిరుద్యోగులు! మన దేశంలో మిగతా రాష్ట్రాలు భౌగోళికంగా ఏర్పడితే, తెలంగాణ ఒక భావోద్వేగా రాష్ట్రం,కదిలిస్తే ఇక్కడ అమరవీరుల తల్లుల కన్నీళ్లు కన్పిస్తాయి.నీళ్లు,నిధుల కోసం నాయకులు కొట్లాడితే కొలువులే కొలమానంగా తొలి నుండి తుది తెలంగాణ ఉద్యమంలో కొట్లాడింది విద్యార్థులే. తెలంగాణ వొస్తే కోరుకున్న కొలువు వొస్తదని,గొప్పగా బతుకుతాం అని విద్యార్థులు తమ జీవితాలని…

విద్యార్థి యువతపై సామాజిక ప్రభావం..!!

Social impact on student youth..!!

మనిషి సంఘజీవి” అని అరిస్టాటిల్ అన్నాడు మనిషి సమిష్టిగా తప్ప మరోలా జీవించలేదు కనుక సమాజంలోని ప్రజలందరిపై సామాజిక ప్రభావం వుండటం సహజమూ తప్పనిసరి విద్యార్థి యువత పైన సమాజం తీవ్ర ప్రభావాన్ని ప్రసరిస్తుంది. విద్యార్థి యువతమీద వర్తమాన సమాజ ప్రభావాన్ని మనం అర్థం చేసుకునే ముందు విద్యార్థి యువత కుండే ప్రత్యేక లక్షణాలను అర్థం చేసుకోవడం…