Prajatantra News 1

Prajatantra News 1

ధరలు స్వారీ చేస్తున్నాయి…!

India deteriorating economy day by day

ద్రవ్యోల్బణ పరిస్థితులను నివారించడంలో పటిష్టమైన చర్యలెవీ? నానాటికీ దిగజారుతున్న భారత ఆర్థిక వ్యవస్థ ద్రవ్యోల్బణ పరిస్థితులను నివారించడంలో పటిష్టమైన చర్యలు తీసుకోవడం లేదు. రూపాయి మారకం విలువ నానాటికి దిగజారుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం 84 రూపాయలు దాటింది. ధరలు స్వారీ చేస్తున్నాయి. ప్రధానంగగా బియ్యం,ఉప్పు, పప్పుల ధరలు విపరీతంగా పెరుగుతున్నా అజమాయిషీ చేయడంలేదు.…

కుటుంబ సర్వేకు ఆటంకాలు సృష్టిస్తే కఠిన చర్యలు

బలహీనవర్గాలకు మేలు జరగొద్దని బిజెపి, బిఆర్‌ఎస్‌ అభిమతం : మంత్రి శ్రీధర్‌ బాబు తమ అధినేత రాహుల్‌ గాంధీ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామాజిక సమగ్ర కుటుంబ సర్వేకు ఆటంకాలు కల్పించినా, ప్రజల్లో అపోహలు సృష్టించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు హెచ్చరించారు. గత ప్రభుత్వం…

జనాభా లో 60 శాతం ప్రజలకు ఉచిత రేషన్‌ ‌దేనికి సంకేతం ..?

free ration yojana

వికసిత భారత్‌ ‌లక్ష్యంగా పదేళ్లుగా మోదీ నేతృత్వంలోని బిజెపి పాలన సాగుతోంది. పడికట్టు పదాలు బాగా అలవాటు చేసుకున్నారు. అభివృద్ది పేరుతో నయవంచన సాగుతోంది. గత 20 ఏళ్ల కాలానికి పోలిస్తే దేశంలో అభివృద్ది అన్నది ఎండమావి అన్న విమర్శలు ఉన్నాయి. కోట్లాది మంది రైతులకు నేరుగా నగదు బదిలీ చేస్తున్నామంటేనే వారికి తగిన గిట్టుబాటు…

సంగెం మూసీనది ఒడ్డున శివలింగానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు

మూసీ పునరుజ్జీవన పాదయాత్రకు శ్రీకారం ముఖ్య‌మంత్రి వెంట నడిచిన మంత్రులు మూసీ పునరుజ్జీవన పాదయాత్రను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. సంగెంలోని మూసీనది ఒడ్డున ఉన్న శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించి యాత్రను మొదలుపెట్టారు. యాదాద్రి జిల్లా వలిగొండ మండలం సంగెం నుంచి భీమలింగం వరకు సుమారు 2.5 కిలోమీట‌ర్ల మేర పాదయాత్ర కొనసాగింది. మూసీ పునరుజ్జీవ…

తోపులాటలో ఇరుక్కపోయిన మంత్రి

Kondasurekha got stuck in crowd

ఎంతో శ్రమించి బయటకు తీసుకొచ్చిన పోలీసులు  స్వయంగా రాష్ట్రానికి మంత్రి అయిన కొండాసురేఖ తోపులాటలో ఇరుక్కుపోయి ఇబ్బందులకు గురయ్యారు. చుట్టూ పోలీసులు, అధికారులు ఉన్నప్పటికీ తోపులాట నుంచి మంత్రిని బయటకు తీయలేని పరిస్థితి ఎదురైంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి యాదాద్రి పర్యటనలో ఈ ఘటన చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం యాదాద్రికి…

యాదాద్రి కాదు.. యాదగిరి గుట్టనే..

టీటీడీ బోర్డు త‌ర‌హాలో యాద‌గిరి గుట్ట ఆల‌య బోర్డు.. గో సంరక్షణకు ఒక ప్రత్యేక పాలసీ కొండపై నిద్ర చేసి మొక్కులు తీర్చుకునేలా భ‌క్తుల‌కు ఏర్పాట్లు యాదగిరి గుట్ట ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్ స‌మీక్ష‌ పుట్టినరోజు సందర్భంగా లక్ష్మీనర్సింహస్వామికి ప్రత్యేక పూజలు టీటీడీ తరహాలో యాదగిరి గుట్ట ఆల‌య పాల‌క మండ‌లి బోర్డు ఏర్పాటు…

మూసీ ప్ర‌క్షాళ‌న చేసి తీరుతాం..

ఈ పాదయాత్ర ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది.. విషం చిమ్ముతున్న మూసీకి చికిత్స చేస్తాం.. సంగెం శివయ్యను దర్శించుకుని సంకల్పం తీసుకున్నా.. మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటే ఇక్క‌డివారు మూసీలోనే పాతరేస్తారు. ప్ర‌తిప‌క్షాల‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమ‌ర్శ‌లు.. ఒకనాడు మంచి నీటిని అందించి ప్ర‌జ‌ల దాహార్తిని తీర్చిన‌ మూసీ ఇప్పుడు మురికి కూపంగా మారి…

ముఖ్యమంత్రికి ప్రధాని మోదీ జ‌న్మ‌దిన శుభాకాంక్షలు

సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే  ప్రధాని నరేంద్ర మోదీ సీఎం రేవంత్ రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన దీర్ఘాయువు, ఆరోగ్యవంతమైన జీవితం కోసం దేవుడిని ప్రార్థిస్తున్నాను’’ అని ఎక్స్ వేదికగా మోదీ బర్త్ డే…

మంచిర్యాల గురుకులాల్లో విద్యార్థులకు అస్వస్థత

మంచిర్యాల, ప్రజాతంత్ర,నవంబర్‌ 08 :  ‌వసతుల లేమితో గురుకులాలకు వెళ్లాలంటేనే పిల్లలు జంకుతున్నారు. పలు గురుకులాల్లో విద్యార్థులు హాస్టల్‌ ‌వదిలి ఇంటిబాట పడుతున్నారు.  తాజాగా మంచిర్యాలలోని గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థినికి మరోసారి వాంతులు కాగా, మరో విద్యార్థినికి కడుపు నొప్పితో బాధపడింది. గమనించిన సిబ్బంది హుటాహుటిన ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించి వైద్యం అందించారు. కాగా,…

ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ మల్లు రవి

ఆమనగల్లు, ప్రజాతంత్ర, నవంబర్‌ 8 : ‌తెలంగాణ రాష్టాన్ని ఇందిరమ్మ రాజ్యంతో ఇంటింటా వెలుగు నింపడానికి నిర్విరామ కృషి చేస్తున్న  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ ‌రెడ్డి జన్మదినం సందర్బంగా ఆయన నివాసంలో నాగర్‌ ‌కర్నూల్‌ ఎం‌పీ డాక్టర్‌ ‌మల్లురవి మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా…