NEWS

NEWS

లండన్ లో డా. బి ఆర్ అంబేడ్కర్ హౌస్ సందర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు 

లండన్ లో డా. బి ఆర్ అంబేడ్కర్ హౌస్ సందర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ మరియు గ్రేస్ ఇన్‌లో విద్యనభ్యసించిన రోజుల్లో డా. బి.ఆర్. అంబేడ్కర్ నివసించిన కింగ్ హెన్రీ రోడ్ లో ఉన్న అంబేడ్కర్ హౌస్ ను పర్యటనలో భాగంగా మాజీ మంత్రి,ఎమ్మెల్యే హరీష్ రావు సందర్శించారు.…

‘ సేవల’ పన్ను పై ఉపశమనం ఎక్కడ ..?

ప్రజల నెలాఖరు ఖర్చు “సేవలే నిర్ణయిస్తున్న” కాలంలో , వస్తువులపై మాత్రమే రేట్లు తగ్గించడం headlines-friendly కానీ pocket-unfriendly అవుతుంది . సేవలపై పన్ను శాతం తగ్గకపోతే, జీఎస్టీ రేషనలైజేషన్ సామాన్యుడికి ఉపశమనం కాదు, కేవలం “పునర్వ్యవస్థీకరించిన భారం ” మాత్రమే. నిజమైన ఉపశమనం కావాలంటే, వస్తువులు-సేవలు రెండింటిని సమతుల్యంగా తక్కువ రేట్ల వైపు నడిపే…

జాగృతి కవిత పై బి ఆర్ ఎస్ పార్టీ వేటు 

  జాగృతి కవిత పై బి ఆర్ ఎస్ పార్టీ వేటు Please subscribe our channel youtube.com/@prajatantra-news తెలంగాణా జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ను పార్టీ నుంచి బహిష్కరిస్తూ భారత రాష్ట్ర సమితి నిర్ణయం తీసుకుంది. కవితను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు పార్టీ లేఖ విడుదల చేసింది. క్రమశిక్షణ చర్యలంటూ…

Political Strategy

"కాళేశ్వరంపై విచారణ సీబీఐకి ఇవ్వడం ఏఐసీసీ నిర్ణయమా.? రేవంత్‌ రెడ్డి నిర్ణయమా.?.అన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి..దేశంలో సీబీఐ, ఈడీ, ఐటీ వంటి సంస్థలు బీజేపీ జేబు సంస్థలని, ప్రతి పక్షాలపై కేసులు పెట్టి వేధించేందుకే విచారణ సంస్థలను బీజేపీ ఉపయోగిస్తుందని రాహుల్‌ గాంధీ కేంద్రంపై విమర్శలు చేస్తున్నారు..సీబీఐ బీజేపీ చేతిలో కీలుబొమ్మ అని చెప్పి ఇప్పుడు మళ్లీ అదే సీబీఐకి కాళేశ్వరం కేసు ఇవ్వడంలో ఉద్దేశ్యం ఏంటీ.?" కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవకతవకలపై జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదికపై అసెంబ్లీలో ఆదివారం వాడివేడి చర్చ జరిగింది. అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్‌ జరిగింది.ఆరోపణలు ప్రత్యారోపణలతో సభ ఆసాంతం హాట్‌ హాట్‌ గా సభ అర్ధరాత్రి దాటే వరకూ సాగింది. జస్టిస్‌ ఘోష్‌ గొప్పతనాన్ని ట్రెజరీ బెంచ్‌ సభలో చెప్పితే, జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ సహజ న్యాయ సూత్రాలకు విరుద్దంగా నివేదిక ఇచ్చిందని, ఆరోపణలు ఎదుర్కొంటున్న తమను క్రాస్‌ ఎగ్జామింగ్‌ చేయండా, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1952లో 8(బి) కమిషన్‌ పట్టించుకోలేదని, ప్రతిపక్షాన్ని బద్నాం చేసే కుట్రలు కాంగ్రెస్‌, జస్టిస్‌ ఘోష్‌ చేశారని ప్రతిపక్షం ఆరోపించింది. చర్చలో పాల్గొన్న బీజేపీ, ఎంఐఎం పార్టీలు ప్రభుత్వం తీరును తప్పుపట్టాయి .ఘోష్‌ కమిషన్‌ ఏర్పాటు జీఓ లోనే ఆర్ధిక అంశాలు, అవినీతి ఎజెండా లేకపోవడంపై విమర్శించాయి. సభలో మంత్రుల భిన్న ప్రకటనలపై ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ప్రశ్నించారు.ఎలక్టోరల్ బాండ్స్‌ కోసమే కాంగ్రెస్‌ కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో పాల్గొన్న నిర్మాణ సంస్థలను ఘోష్‌ కమిషన్‌ విచారణ చేయకుండా మినహాయించారని ఆరోపించారు.అధికారులను,ప్రతిపక్షాలను టార్గెట్‌ చేసేలా ఘోష్ నివేదిక ఉందన్నారు. అప్పుడు ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శిగా ఉండి, ఇప్పుడు సీఎస్ గా ఉన్న రామకృష్ణారావును ఎందుకు కమిషన్ విచారించలేదని, ఇది ఫేర్‌ ఆండ్ నిజాయితీ నివేదిక ఎలా అవుతుందని ప్రశ్నించారు..ఘోష్ కమిషన్‌ స్వతంత్రంగా పని చేయలేదని,ప్రభుత్వం ఒత్తిడితో నివేదిక ఇచ్చినట్లు ఉందన్నారు..విజిలెన్స్‌ కమిషన్‌, ఎన్డీఎస్ ఇచ్చిన రిపోర్ట్‌ ఉందని మండిపడ్డారు. సభ ప్రతిపక్షాలు లేవనెత్తిన అనేక ప్రశ్నలను, అనుమానాలను ప్రభుత్వం బుల్డోజ్‌ చేసింది..ఒకానొక సమయంలో ట్రెజరీ బెంజ్‌ డిఫెన్స్‌లో పడింది..సభలో ట్రెజరీ బెంచ్‌కు ఉండే అనుకూలతో కమిషన్‌ నివేదికపై చర్చ సజావుగా జరగకుండా,విపక్షాల ప్రశ్నలపై మంత్రులు,సీఎం అసహనానికి గురయ్యారు. కాళేశ్వరంపై ఘోష్ నివేదిక పెద్ద సబ్జెట్‌..తెలంగాణ ఫ్యూచర్‌ను డిసైడ్‌ చేసే అంశం.అలాంటి నివేదికపై షార్ట్ డిస్కషన్ తో వాస్తవాలు బయటకు రాకుండానే ప్రభుత్వం సభను ముగించింది..కాళేశ్వరంలో ఏం జరిగింది..జస్టిస్‌ ఘోష్‌ తన నివేదికలో ఏమిచ్చారో తెలుసుకోవాలన్న ఉత్కంఠతో తెలంగాణ సమాజం ఎదురు చూసింది..అసెంబ్లీలో చర్చ జరిగిన తీరుపై తెలంగాణ సమాజం అసంతృప్తితో ఉంది..ప్రభుత్వం స్వల్పకాలిక చర్చతో ముగించడంతో అనేక ప్రశ్నాలు ప్రజల మెదళ్లను తొలుస్తున్నాయి.రిపోర్ట్‌లో ఏముందో చర్చ లేకుండానే రాజకీయ విమర్శలతోనే సర్కార్ సభను ముగించార్న అసహనం ప్రజల్లో వ్యక్తమౌతుంది.నివేదికలోని వాస్తవాలు బయటపెట్టే చిత్తశుద్ధి ప్రభుత్వంలో కొరవడిందని, ప్రతిపక్షంపై బట్ట కాల్చి మీదేసే ప్రయత్నమే సభలో జరిగిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పై తుపాకీ పెట్టి గత ప్రభుత్వాన్ని బద్నాం చేయాన్న కాంగ్రెస్‌ వ్యూహం పూర్తి స్థాయిలో సక్సెక్‌ కాలేదు..కేసీఆర్‌, హరీష్‌ రావును రాజకీయంగా ఇబ్బంది పెట్టాలన్న రేవంత్‌ ఎత్తులు ఫలించలేదు.ఘోష్‌ కమిషన్‌లో తప్పులపై బీఆర్ఎస్‌తో పాటు బీజేపీ, ఎంఐఎం ఎత్తి చూపడంతో సర్కార్‌ డిఫెన్స్‌లో పడ్డది..బీఆర్ఎస్‌ను టార్గెట్‌ చేసే క్రమంలో బీజేపీ, ఎంఐఎంలను వ్యూహత్మంగా తనమైపు తిప్పుకుని సభలో ఒంటరి చేయాలనుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఎత్తులు విఫలం అయ్యాయి.సభలో కాంగ్రెస్‌ దాని మిత్ర పక్షం సీపీఐ మినహా మిగతా ప్రతిపక్షాలన్నీఒక్కటయ్యాయి. బీఆర్ఎస్‌కు వాదనతో ప్రత్యేక్షంగా ఏకీభవించకున్న ఘోష్ నివేదికలో లోపాలపై విమర్శలు ఒకేలా ఉన్నాయి..అవినీతి అంశాలు, తీసుకోవాల్సిన చర్యలపై నివేదికలో లేకపోవడంతో నివేదికను తప్పుబట్టారు. కాళేశ్వరం నివేదికపై ఎలాంటి విచారణ చేయాలో ప్రభుత్వం ముందే నిర్ణయం తీసుకుంది. కేసును సీబీఐకి అప్పగించేందుకు సిద్దమైంది.బీఆర్ఎస్‌ను ఇరుకున పెట్టాలన్న ఉద్దేశ్యంతో అసెంబ్లీలో చర్చించి చర్యలు తీసుకుట్టాం అని ప్రభుత్వం చెప్పింది..అయితే నివేదికపై పూర్తి స్థాయిలో చర్చ లేకుండానే ప్రభుత్వం తాను చేయాల్సింది చేసింది. .గతంలో సీబీఐకి ఫిర్యాదు చేసిన రేవంత్‌ ఇప్పుడు కేసును సీబీఐకి అప్పగించేందుకు అసెంబ్లీని ఒక రాజకీయ ఎత్తుగడగా వాడుకున్నారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ చేతులెత్తేసినట్లు స్పష్టం అవుతుంది.కేసును రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీబీఐకి అప్పగించడంతో బంతి కేంద్రం కోర్ట్‌లోకి నెట్టడంతో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.గతంలో సీబీఐపై ఫిర్యాదు చేసిన రేవంత్‌ ఇప్పుడు ఎందుకు సీబీఐ విచారణకు ఇవ్వడం లేదన్న బీజేపీ ఒత్తిడితోనే..కమిషన్‌ నివేదికలో రాష్ట్ర ప్రభుత్వానికి విచారణాంశం దొరక్కపోవడంతో వ్యూహత్మంగా బంతిని కేంద్రం పరిధిలోకి నెట్టారన్న చర్చ ఉంది. కమిషన్‌ నివేదికలో లోపాలున్నాయన్న ప్రశ్నలు వస్తుండటంతో అది కోర్ట్‌లో నిలుస్తుందా..? లేదా.? అన్న అనుమానాలున్నాయి..కోర్ట్ కమిషన్‌ నివేదికను రద్దు చేస్తే ఆ బద్నాం కాంగ్రెస్‌పై పడుతుంది..ఈ నేపథ్యంలో సీబీఐకి ఇస్తే కోర్ట్‌లో ఎలాంటి తీర్పు వచ్చిన తాను సేఫ్‌ జోన్లో ఉండవచ్చనే ఉద్దేశ్యంతోనే కేంద్రం పరిధిలోని సీబీఐకి ఇచ్చారన్న డౌట్స్ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. మరోవైపు కాళేశ్వరంపై విచారణ సీబీఐకి ఇవ్వడం ఏఐసీసీ నిర్ణయమా.?.రేవంత్‌ రెడ్డి నిర్ణయమా.?.అన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి..దేశంలో సీబీఐ, ఈడీ, ఐటీ వంటి సంస్థలు బీజేపీ జేబు సంస్థలని, ప్రతి పక్షాలపై కేసులు పెట్టి వేధించేందుకే విచారణ సంస్థలను బీజేపీ ఉపయోగిస్తుందని రాహుల్‌ గాంధీ కేంద్రంపై విమర్శలు చేస్తున్నారు..సీబీఐ బీజేపీ చేతిలో కీలుబొమ్మ అని చెప్పి ఇప్పుడు మళ్లీ అదే సీబీఐకి కాళేశ్వరం కేసు ఇవ్వడంలో ఉద్దేశ్యం ఏంటీ.? జాతీయ స్థాయిలో పక్షపాతంగా విచారణలు చేస్తుందన్న సీబీఐ..కాళేశ్వరం కేసులో సీబీఐ నిస్పక్షపాతంగా విచారణ చేస్తుందన్న గ్యారంటీ ఏందీ.?..విచారణ సంస్థలపై ఏఐసీసీ స్టాండ్ ఎంటీ.?.కాంగ్రెస్‌ పట్ల సీబీఐ, ఈడీలు కక్ష పూరితంగా వ్యవహరిస్తాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కేసుల విచారణ మరోలా ఉంటుందా.?.. అసలు కోర్ట్‌ లో నిలవని నివేదికపై సీబీఐ కేసు నమోదు చేస్తుందా.?. ఒకవేళ రేవంత్ రెడ్డిపై ప్రేమతో కేంద్రం ఆదేశాలతో కేసు నమోదు చేస్తే, నివేదికను న్యాయ స్థానం రద్దు చేస్తే కేసు నిలుస్తుందా..?.ఇలా రాష్ట్ర పరిధి నుంచి కేంద్ర పరిధిలోకి కాళేశ్వరం కేసు నెట్టడంలో వ్యూహం ఏంటన్న మౌళిక ప్రశ్నాలు వస్తున్నాయి. పదేపదే బీజేపీ-బీఆర్ఎస్‌ ఒక్కటే అని విమర్శలు చేసే కాంగ్రెస్‌.సీబీఐ కేంద్రం చేతిలో కీలుబొమ్మ అనే రాహుల్‌ గాంధీలు.మరి కాళేశ్వరంపై విచారణ సీబీఐకి ఇస్తే వాస్తవాలు బయటకు వస్తాయని ప్రజలు ఎలా నమ్ముతారు.?.అదే సమయంలో కాంగ్రెస్‌ బీఆర్ఎస్‌ ఒక్కటే అని ప్రచారం చేసే బీజేపీ.ఇప్పుడు రెండు పార్టీలు ఒక్కటే అయితే కేంద్రం పరిధిలో ఉన్న సీబీఐ విచారణకు ఎందుకు ఇస్తుంది.?. దీనికి జాతీయ పార్టీలు సమాధానం చెప్పాలి.లేకపోతే బీఆర్ఎస్‌ను వేధించడంలో కాంగ్రెస్‌ బీజేపీలు ఒక్కటే అన్న అభిప్రాయం తెలంగాణ ప్రజల్లో బలపడుతుంది. నిజానికి కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టేందుకు ఇప్పటి వరకూ బీజేపీకి ఎలాంటి అవకాశం దొరకలేదు.కేసీఆర్‌ చుట్టూ ఉచ్చు బిగించేందుకు రేవంత్‌ బీజేపీ ప్లాన్‌ చేస్తుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.కేసులతో వేధించి లొంగదీసుకోవడం బీజేపీ కి అలవాటు.కేసీఆర్‌ విషయంలో కూడా అదే వ్యూహంతో ఉన్నారు.గతంలో కవితను అడ్డుపెట్టుకుని కేసీఆర్‌ను దారికి తెచ్చుకునే ప్రయత్నం చేసి విఫలం అయ్యింది.దీంతో కేసీఆర్‌ను బీఆర్ఎస్‌ను తన గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు రేవంత్‌ రెడ్డిని ముందుపెట్టి సీబీఐ విచారణతో తన పరిధిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేశారు.ఈ నేపథ్యంలోనే ఏ విచారణ సంస్థలపై హైకమాండ్ పోరాటం చేస్తున్నారో అదే సంస్ధలకు విచారణ బాధ్యతలు అప్పగించారు. అంతేకాదు,కమిషన్‌ ఇచ్చిన నివేదికలో అవినీతిపై ఎక్కడ ప్రస్తావించలేదు.ఈ క్రమంలో సీబీఐ విచారణతో కేసీఆర్‌ టార్గట్‌ చేసినట్లు కనిపిస్తుంది..అయితే సీబీఐ విచారణ అంటే అది కేంద్రం చేతిలో ఆయుధం మాత్రమే తప్ప అది ఎప్పటికీ పూర్తి అవుతుందో నేరం నిరూపించేందుకు ఏన్నేళ్లు పట్టుతుందో చెప్పలేం..తరాలు మారిన విచారణ పూర్తికాదు.సీబీఐ విచారించిన 99 శాతం కేసులు కోర్ట్‌లు కొట్టేశాయి..నేరం నిరూపించడంలో విఫలం అయిన చరిత్ర సీబీఐకి ఉంది. మొదట సీబీఐకి కేసు అప్పగించి, నెక్ట్ ఈడీని రంగంలోకి దించే అవకాశం ఉంది.సీబీఐ కేసు నమోదు చేస్తే దర్యాప్తు సంస్థనే నేరం నిరూపించాలి..అదే ఈడీ నేరారోపణ చేస్తే నిందిడులే నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది..ఈ లాజిక్‌తో రేవంత్‌, బీజేపీలు కేసీఆర్‌ను జైల్లో పెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లున్నారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ అనేది ఒక రాజకీయ ఎత్తుగడే. అది ఎప్పుడు తేలుతుందో చెప్పలేం.సీబీఐ విచారణకు కేసీఆర్‌, హరీష్ రావు తప్పకుండా సహకరించాలి.సహకరిస్తారు కూడా. అయితే సీబీఐ విచారణతో బీఆర్ఎస్‌ను కొంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం కాంగ్రెస్‌ బీజేపీ చేయవచ్చు.కానీ అది రాష్ట్రంలో కాంగ్రెస్‌కు నష్టం చేస్తుంది తప్ప లాభం ఉండదు..బీజేపీ కాంగ్రెస్‌ కలిసి బీఆర్ఎస్‌ను రాజకీయంగా టార్గెట్‌ చేస్తున్నారన్న బలమైనవాదన తెలంగాణ సమాజం నుంచి వస్తుంది. -తోటకూర రమేష్

Although the decision of the Telangana state government to hand over the investigation of irregularities in the construction of the Kaleshwaram project to the Central Bureau of Investigation (CBI) is seen as a political strategy that corners state leaders of…

కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవొద్దు : హై కోర్టు

కాళేశ్వరం పై  జస్టిస్ పి సీ ఘోష్  కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవొద్దని హై కోర్టు  ఆదేశించింది. అక్టోబర్ ఏడో తేదీన తదుపరి విచారణ చేపడతామని తెలిపింది. దీంతో కేసీఆర్, హరీశ్ రావుకు భారీ ఊరట లభించినట్లయింది.కాళేశ్వరం కమిషన్ నివేదికపై సీబీఐ విచారణ జరిపించాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయానికి బ్రేక్ పడినట్లయింది .…

కాళేశ్వరం కేసు సీబీఐ విచారణకు….

  కాళేశ్వరం కేసును సీబీఐ కి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆదివారం రాష్ట్ర అసెంబ్లీ లో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులు..జరిగిన అవకతవకల పై జస్టిస్ పి సి గోష్ నివేదిక పై సుదీర్ఘ చర్చ అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆఖరున సభా నాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ “మేడిగడ్డ నిర్వహణ..నిర్మాణం…

యాదాద్రిలోభారీ వర్షాలతో పొంగిపొర్లుతున్న వాగులు వంకలు..

జిల్లాలో భారీ వర్షాలు నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు…యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 27 :యాదగిరిగుట్ట మండలం, చొల్లేరు గ్రామములొ భారీ వర్షాల కారణంగా వాగులు వంకలలో వర్షం నీరు భారీగా ప్రవహిస్తుండడంతో చోలేరు రోడ్డు మీదుగా నిరు ప్రవహిస్తుండడంతో ఆ మార్గంలో ప్రయాణించే ప్రయాణికులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అప్రమత్తమైన అధికారులు రోడ్డుకు ఇరువైపులా బార్…

ఛత్తీస్‌గఢ్ ,మహారాష్ట్ర సరిహద్దులో భారీ ఎన్ కౌంటర్

  భద్రాచలం,ప్రజాతంత్ర, ఆగస్ట్ 27:నలుగురు మావోయిస్టులు మృతి చెందగా మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో పురుషుడుతో పాటు ముగ్గురు మహిళా మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం.గడ్చిరోలి-నారాయణ్‌పూర్ సరిహద్దులో 8 గంటలుగా కొనసాగుతున్న ఎన్‌కౌంటర్ సంఘటనస్థలి నుండి భారీగా ఆయుధాలతో పాటు మృత దేహాలు భద్రత దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఆపరేషన్ లో C-60 మరియు CRPF భద్రతా…

కామారెడ్డి జిల్లాలో వర్ష బీభత్సం 

మునిగిన గ్రామాలు  పొంగిపొర్లుతున్న వాగులు  కొట్టుకుపోయిన రహదారులు ..రైల్వే ట్రాక్ లు  కామారెడ్డి జిల్లాలో బుధవారం  కురిసిన భారీ వర్షాలు వినాయక చవితి పండుగ పూట  తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి.  తిమ్మారెడ్డి వద్ద కల్యాణి వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో బ్రిడ్జి నిర్మాణ పనుల్లో నిమగ్నమైన ఆరుగురు కార్మికులు వరద నీటిలో చిక్కుకున్నారు. వారు ప్రాణాలను కాపాడుకునేందుకు…

గాజా బ‌లిపీఠంపై జ‌ర్న‌లిస్టుల ప్రాణాలు..

      అంత‌ర్జాతీయ జ‌ర్న‌లిస్టుల స‌మాఖ్య అంచ‌నా ప్ర‌కారం గాజాలో ప్ర‌స్తుతం వెయ్యిమంది జ‌ర్న‌లిస్టులు ప‌నిచేస్తున్నారు.  గాజా ప్రాంత జ‌నాబా రెండు మిలియ‌న్లు. వీరిలో అత్య‌ధిక సంఖ్యాకులు హ‌స్పిట‌ల్ కారిడార్లు, టెంట్లు, కార్ల‌లో నిద్ర‌పోతూ గ‌డుపుతున్నారు. వీరిలో కొంత‌మంది డ‌జ‌న్ల‌కొద్దీ త‌మ బంధువులను కోల్పోయి పెను విషాదంలో బ‌తుకులీడుస్తున్నారు. కొంతమంది త‌మ పిల్ల‌ల‌కు దూరంగా…