– రూ.50 వేల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ తహసీల్దార్
కామారెడ్డి, ప్రజాతంత్ర, జనవరి 6: కామారెడ్డి జిల్లాలో ఓ తహసీల్దార్ ఏసీబీ వలలో చిక్కాడు. రూ. 50 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యండెడ్‌గా పట్టుబడ్డాడు. నాగిరెడ్డిపేట మండల తహసీల్దార్‌గా పనిచేస్తున్న యార్లగడ్డ శ్రీనివాస్ రావును, లంచం తీసుకోవడంలో మద్యవర్తిగా వ్యవహరించిన ప్రైవేట్ వ్యక్తి చినూరు అజయ్ అనే వ్యక్తిని పట్టుకున్నారు. మండలానికి చెందిన ఓ వ్యక్తి తన తండ్రి పేరుపై ఉన్న వ్యవసాయ భూమిని తన పేరు మీద బదిలీ చేయాలని కోరగా అందుకు లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ నేతృత్వంలో సిబ్బంది కార్యాలయంపై మంగళవారం మాటు వేసి తహసీల్దార్ లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు. ఇద్దరినీ నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
———————————————————————————————————————————————————————————-
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





