ఒంటరి వృద్దురాలిపై దాడి

– రోకలిబండతో మోదిన దుండుగులు
– బంగారం దోచుకుని పరార్

కామారెడ్డి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 13 : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో ఓ ఇంట్లోకి చొరబడి వృద్ధురాలిపై రోకలిబండతో దాడి చేసి ఆమె బంగారు ఆభరణాలను అపహరించిన ఘటన ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. ఓ వృద్ధురాలు ఒంటరిగా ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడ్డారు. ఆమెపై దాడికి పాల్పడి  ఆమె బంగారు ఆభరణాలను లాక్కుని పరారయ్యారు. దాడికి రోకలి బండను ఉపయోగించినట్లు సమాచారం. వాటి విలువ ఎంతన్నది పోలీసులు నిర్దారించలేñదు. రక్తస్రావం అవుతున్న ఆమెను స్థానికులు సమీప హాస్పిటల్‌కు తరలించారు. తలకు తీవ్ర గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్య బృందం పర్యవేక్షిస్తోంది. వృద్ధురాలిపై దాడి జరగడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దుండగులు ముందుగా ఇంటి పరిస్థితిని గమనించి ఎవరూ లేని సమయం చూసి దాడి చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు వ ద్ధురాలి ఇంటిని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ ప్రాంతంలోని సీసీ టీవీ ఫుటేజ్‌ను సేకరించి అనుమానితులను గుర్తించడానికి చర్యలు చేపట్టారు. స్థానికుల నుంచి కూడా సమాచారం సేకరిస్తున్నారు.
——————————————————————————————————————————————————————-

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *