ఇది ప్రజాస్వామ్య మూలాలపై జరిగిన దాడి

– సీజేఐపై దాడికి కేటీఆర్‌ ఖండన

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 7: మన దేశంలో అసహనం అత్యున్నత స్థాయికి చేరుకుందని, దీనికి సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) బి.ఆర్‌.గవాయ్‌పై దాడి జరగడం ఒక దారుణమైన సంకేతమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు.
ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన దాడిని తీవ్రంగా, నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నానన్నారు. న్యాయవ్యవస్థ గౌరవంపై జరిగిన ఈ దాడి కేవలం ఒక వ్యక్తిపై కాదు.. ఆ వ్యవస్థపైనే జరిగిన దాడి అని అన్నారు. ఇలాంటి దాడులు ప్రజాస్వామ్యం మూలాలకే ముప్పు కలిగిస్తుందన్నారు. కాగా, జల్‌, జంగల్‌, జమీన్‌ అనే నినాదంతో ఆదివాసీ అస్తిత్వం కోసం, ప్రజల హక్కుల కోసం పాటుపడ్డ యోధుడు కుమ్రం (కొమురం) భీం అని, ఆయన పోరాట స్ఫూర్తే తెలంగాణ ఉద్యమంలో కూడా ఇమిడి ఉందని అంటూ ఆయన వర్ధంతి సందర్భంగా కేటీఆర్‌ వివాళులర్పించారు. తమ పార్టీ అధికారంలో ఉన్నపుడు ఆసిఫాబాద్‌ జిల్లాకు కుమ్రం భీం పేరు పెట్టామని, జోడేఘాట్‌లో సుందరమైన స్మృతి వనాన్ని ఏర్పాటు చేశామని, హైదరాబాద్‌ మహానగరంలో కుమ్రం భీం పేరిట ఆదివాసీ భవనాన్ని నిర్మించినందుకు గర్విస్తున్నామన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *