8 మంది దుర్మరణం
ఆస్ట్రియాలో మంగళవారం కాల్పుల కలకలం రేగింది. ఈ ఘటనలో సుమారు 8మంది మరణించారు. దేెశ రాజధాని వియన్నాకు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశంలోని రెండో అతిపెద్ద నగరమైన గ్రాజ్‌లో ఈ పాఠశాల ఉంది. సమాచారం అందగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారని అక్కడి అధికారులు తెలిపారు. ఘటనపై ఆస్ట్రియా అంతర్గత వ్యవహారాల శాఖ స్పందించింది. ఈ కాల్పుల్లో పలువురు మరణించినట్టు తెలిపింది. మృతుల్లో విద్యార్థులు, అధ్యాపకులు ఉన్నారా లేదా అనే అంశాలు తెలియరాలేదు. గాయపడ్డ వారి వివరాలను కూడా ఆ మంత్రిత్వ శాఖ వెల్లడిరచలేదు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఘటన సమాచారం అందగానే ప్రత్యేక పోలీసు దళాలు అక్కడకు చేరుకున్నాయి.





