నిజామాబాద్‌లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు

– ఏటిఎంలను కట్‌ ‌చేసి భారీగా నగదు దోపిడీ
– రంగంలోకి దిగిన పోలీసులు
– దర్యాప్తు ముమ్మరం

నిజామాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 27:‌నిజామాబాద్‌ ‌జిల్లా కేంద్రంలో దోపిడి దొంగలు రెచ్చిపోయారు. ముఖాలకు మాస్కులు ధరించి, చేతులకు గ్లౌజులు పెట్టుకొని ఏటీఎంలు లూటీ చేశారు.శనివారం తెల్లవారు జామున కారులో వొచ్చిన దుండగులు.. గ్యాస్‌ ‌కట్టర్ల సహాయంతో ఏటీఎంలను కట్‌ ‌చేసి అందులోని నగదు దోచుకుపోయారు. నగరంలోని ఆర్యనగర్‌, ‌సాయినగర్‌ ఏటీఎంలలో భారీ చోరీ జరిగింది. ఏటీఎంలను గ్యాస్‌ ‌కట్టర్‌తో తెరిచి దుండగులు నగదు లూటీ చేశారు.  సాయినగర్‌లోని ఎస్‌బీఐ ఏటీఎంలో సుమారు రూ.9 లక్షలు చోరీ చేశారు. ఆర్యనగర్‌లోని డీసీబీ ఏటీఎంలో దాదాపు రూ.30 లక్షలు ఎత్తుకెళ్లారు. గ్యాస్‌ ‌కట్టర్‌ ‌వాడినప్పుడు మరికొంత నగదు మంటల్లో కాలిపోయింది. ఐదుగురు సభ్యుల ముఠా దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. సీసీ ఫుటేజీల ఆధారంగా కేసులు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలాలను కామారెడ్డి ఎస్పీ రాజేశ్‌ ‌చంద్ర పరిశీలించారు. నిజామాబాద్‌ ‌టౌన్‌ 4 ‌పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలోని పాంగ్రా బ్రాంచ్‌కు సంబంధించిన డెవలప్‌మెంట్‌ ‌క్రెడిట్‌ ‌బ్యాంక్‌ ఏటీఎంలోకి ప్రవేశించిన దుండగులు గ్యాస్‌ ‌కట్టర్‌ ‌సహాయంతో మెషిన్‌ ‌ను కట్‌ ‌చేసి సుమారు రూ. 25 లక్షలు దోచుకున్నారు. అలాగే నగరంలోని ఐదో టౌన్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలోని వర్ని చౌరస్తా వద్ద గల ఎస్‌బీఐ ఏటీఎంలోనూ చోరీకి పాల్పడ్డారు. ముందుగా ఏటీఎం సెంటర్‌లో ఉన్న సీసీ కెమెరాలపై స్పే చేసి రికార్డు కాకుండా జాగ్రత్త పడ్డ దుండగులు.. దాదాపు 10 లక్షల వరకు దోచుకుపోయినట్లు తెలిసింది. ఈ రెండు ఘటనా స్థలాలను కామారెడ్డి ఎస్పీ, ఇంచార్జి సీపీ ఎం.రాజేశ్‌ ‌చంద్ర పరిశీలించారు. చోరీ జరిగిన తీరును పరిశీలించిన అనంతరం.. రెండు బ్యాంకుల మేనేజర్లతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. దోపిడీ జరిగిన ఏటీఎం లోపలి, పరిసర ప్రాంతాల్లోని సీసీ ఫుటేజీని సేకరించి, విశ్లేషించాలని ఇన్‌చార్జి సీపీ ఆదేశించారు. అలాగే క్లూస్‌ ‌టీమ్‌, ‌సాంకేతిక నిపుణులు, స్థానిక పోలీసు బృందాలతో దర్యాప్తు చేస్తున్నారు. ఏటీఎంల దోపిడీతో అప్రమత్తమైన పోలీస్‌ ‌యంత్రాంగం నిఘా కట్టుదిట్టం చేశారు. జిల్లాలోకి వచ్చే, పోయే పాయింట్లలో ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *