– జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి అరెస్టుపై ఖమ్మంలో ఆగ్రహం
– జడ్పీ సెంటర్‌లో ఆందోళన
ఖమ్మం టౌన్, ప్రజాతంత్ర, అక్టోబర్ 23 : కాంగ్రెస్ పాలనలో ఎంఐఎం గూండాలు బరితెగించి గోవులను అక్రమంగా రవాణా చేయడం, గో రక్షకులపై కాల్పులు జరపడం వంటి సంఘటనలు మాఫియాని తలదన్నుతున్నాయని బిజెపి జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు అన్నారు. మేడ్చెల్ జిల్లా ఘట్‌కేసర్ వద్ద గోవులను అక్రమంగా తరలిస్తుండగా అడ్డుకున్న గో రక్షకుడు సోను (ప్రశాంత్)పై ఎంఐఎం గూండాలు కాల్పులు జరిపిన ఘటనపై నిరసన తెలిపిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును పోలీసులు అరెస్ట్ చేయడం బీజేపీ వర్గాలను ఆగ్రహానికి గురిచేసింది. ఈ నేపథ్యంలో కోటేశ్వరరావు ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం జడ్పీ సెంటర్‌లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎంఐఎం గూండాలకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎంఐఎం గూండాలను అరెస్ట్ చేయాలి.. గో రక్షకుడిపై దాడిని సహించేది లేదు.. గోమాత రక్షణ మా ధర్మం.. గూండాలకు కఠిన శిక్షలు విధించాలి.. కాంగ్రెస్ డౌన్ డౌన్ అనే నినాదాలతో జడ్పీ సెంటర్ మార్మోగింది. ఈ సందర్భంగా నెల్లూరి మాట్లాడుతూ గోవులను రక్షించేందుకు కృషి చేస్తున్న సోను (ప్రశాంత్)పై కాల్పులు జరగడం హిందూ ధర్మంపై దాడి అని, దీనిపై ప్రశ్నించిన రామచంద్రరావుని ప్రభుత్వం అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యంపై దాడి అని అభివర్ణించారు. రాష్ట్రవ్యాప్తంగా గో రక్షణ, హిందూ రక్షణ పేరుతో జరుగుతున్న ఉద్యమాలను అణచివేయడం పాలకుల అసహనానికి నిదర్శనం అని వ్యాఖ్యానించారు. ప్రజల మనోభావాలను దెబ్బతీస్తే, బీజేపీ ప్రజా ఉద్యమాన్ని ముమ్మరం చేస్తుంది అని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గుత్తా వెంకటేశ్వర్లు, నల్లగట్టు ప్రవీణ్ కుమార్, సీనియర్ నాయకుడు మందడపు సుబ్బారావు, పాలేరు అసెంబ్లీ కంటెస్టెడ్ అభ్యర్థి నున్న రవికుమార్, జిల్లా ఉపాధ్యక్షులు బానోత్ రవి, వీరవెల్లి రాజేష్, బండారు నరేష్న, కిరికంటి వీరభద్రం, శ్రీరామనేని మనీ, మందా సరస్వతి, ఆఫీస్ సెక్రటరీ నక్క రవి, మీడియా కన్వీనర్ నెల్లూరి బెనర్జీ, సోషల్ మీడియా కన్వీనర్ కందుల శ్రీకృష్ణ, ఐటీ కన్వీనర్ బోయినపల్లి సురేష్, జిల్లా కోశాధికారి కొణతం లక్ష్మీనారాయణ, రేఖా సత్యనారాయణ,మండల అధ్యక్షులు గడీల నరేష్, వాకదాని రామకృష్ణ, గుత్తా వంశీ, జాటోత్ మధు, మహేందర్ సింగ్, రుద్రగాని మాధవ్, కన్నెకంటి కృష్ణచారి, భూక్య వెంకట్, జ్యోతుల యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.
——————————————————————————————————————————————————————
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





