సీఎంతో అరవింద్‌ సుబ్రమణియన్‌ భేటీ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12: ప్రముఖ ఆర్థికవేత్త, భారత ప్రభుత్వ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రమణియన్‌ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని జూబ్లీహిల్స్‌ నివాసంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 8,9 తేదీల్లో జరిగిన తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన విజన్‌-2047ను ఆవిష్కరించి అనుసరించడం ద్వారా రాష్ట్రం గణనీయమైన ప్రగతిని సాధిస్తుందని తెలిపిన విషయం విదితమే. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ శాలువా కప్పి ఆయనను సత్కరించారు. ఈ భేటీలో సీఎంతోపాటు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు తదితర అధికారులు ఉన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *