చీమల ఫోబియాతో మహిళ ఆత్మహత్య

సంగారెడ్డి, నవంబర్‌ 6 : అనేకమంది అనేక రకాల వ్యాధులతోనో, మానసిక ఇబ్బందులతోనూ ఆత్మహత్యలు చేసుకుంటుంటారు. అలాగే ఆరోగ్యం బాగాలేక, జీవితంలో ఓటములు ఎదురుకావడం, డిప్రెషన్‌, రుణాల ఒత్తిడి వంటి కారణాలతో ఆత్మహత్యకు పాల్పడుతుంటారు. కానీ ఇందుకు భిన్నంగా ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న కారణం అందరినీ నివ్వెరపరుస్తోంది. ఎలాంటి ఆరోగ్య, ఆర్థిక సమస్యలు, జీవితంలో ఓటములు వంటి సమస్యలు ఆమెకు లేవు. కానీ ఆత్మహత్య చేసుకుంది. కారణమేంటని ఆరా తీస్తే సూసైడ్‌ నోట్‌లో రాసి ఉన్న అంశం ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది. ఇలా కూడా చనిపోతారా? వామ్మో అంటూ విషయం తెలుసుకున్నవారు ఆశ్చర్యపోతున్నారు. చీమల ఫోబియాతో సంగారెడ్డి జిల్లా అవిూన్‌పూర్‌ మున్సిపాలిటీలోని శర్వా హోమ్స్‌లో మనీషా అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చీమల ఫోబియాతో తాను చనిపోతున్నానని, తన కూతురు జాగ్రత్త అంటూ సూసైడ్‌ నోట్‌లో పేర్కొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గృహిణి మరణంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *