34 జనధర్మో విజయతే
జనధర్మ తెలంగాణ ఉద్యమ కవితా సంకలన
ముఖ్యమంత్రి అఖిల రాజకీయ పార్టీల శాసనసభ్యులనూ నాయకులనూ సమావేశపరచి 1969 జనవరి 8, 19న చర్చించి ఒక కొత్త ఒప్పందం చేశారు. ఈ ఒప్పందంపై తెలంగాణా ఆంధ్ర ప్రాంతాలవారు 45 మంది సంతకాలు చేశారు. దీనిననుసరించి తెలంగాణా ప్రాంతం వారికి రిజర్వు చేసిన ఉద్యోగాలలో నున్న ఆంధ్రులను 28-2-69 లోగా ఆంధ్ర ప్రాంతానికి పంపివేసే ఉత్తరువును ప్రభుత్వం జారీ చేసింది. మిగులు నిధుల నికర మొత్తం తేల్చడానికి భారత్ ఆడిటర్ జనరల్‌ను తమ శాలలోని ఒక ఉన్నతోద్యోగిని పంపవలసిందిగా కోరింది. ఉద్యోగుల సీనియారిటీ గ్రెడెషన్ లిస్టులు తయారు చేయటానికి ఉభయ ప్రాంతాలకు చెందిన్ రెవెన్యూ బోర్డు సభ్యులను నియమించింది. ముల్కీ నిబంధనలు మరో అయిదేళ్లు పాటించటానికి వీలుగాను, ఆర్ టిసి, విద్యున్మండలి వంటి సంస్థల ఉద్యోగాలకు కూడా మల్కీ నిబంధనలు వర్తించే చట్టం చేయవలసిందిగా కేంద్ర ప్రభుత్త్వాన్ని కోరింది. తేలిన మిగులు నిధులు ఎంత మొత్తమే ప్రణాళిక కాలంలో పూర్తిగా వెచ్చించి తెలంగాణా అభివృద్ధి లెక్కలు 6 నెలలకోసారి తనికీ చేయటానికీ, ఏటా మిగిలిన నిధులు మరుసటి సంవత్సరంలోనే వెచ్చించటానికీ ప్రాతిపదిక ఏర్పాటు చేసింది.
ఈ ఒప్పందం అమలు తీరును పరిశీలించే నిమిత్తం హక్కుల రక్షణ ఉద్యమాన్ని 28-2-69 వరకు వాయిదా వేయాలని రక్షణ సమితి తీర్మానించింది. శ్రీ మల్లికార్జున్ నాయకత్వాన ఉన్న ప్రత్యేక తెలంగాణా కోరే విద్యార్థి కార్యాచరణ సమితి ఈ ఒప్పందాన్ని తిరస్కరించారు. 1956 ఒప్పందానికి పట్టిన గతే దీనికి పడుతుందనీ, ఆ ఒప్పందం అమలు చేయని వారిని ఒప్పందం చేయగలరని విశ్వసించజాలమని ప్రకటించారు. 1656 ఒప్పందంలోని 1, 8, 9, 11, 13 క్లాజులు భంగపరచబడగా ఈ లోపాలను సరిచేసే ప్రస్తావనే అభిలపక్ష ఒప్పందంలో లేదు కనకనూ “శానన విధానాలు, అభివృద్ధి కార్యకలాపాలు, స్థానిక స్వయం పరిపాలన సమస్యలు, ఆరోగ్య వసతులు, ప్రాథమిక ఉన్నత విద్యావనరులు, తెలంగాణా ప్రాంత పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశావకాశాలు, భూముల క్రయ విక్రయాలూ, వ్యవసాయ, సహకార, మార్కెట్ సంతల వ్యవస్థ ముల్కీల ఉద్యోగుల నిబంధనలు, ఉద్యోగుల తొలగింపు సమస్యలు ప్రాంతీయ కమిటీ విధి బాధ్యతలలో చేర్చబడి ఆయా సమస్యలలో జనాభా నిష్పత్తి సూత్ర ప్రాతిపదిక పరిగణనకు అవకాశాలను” 1956 ఒప్పందంలో కల్పించారనీ వాటి విషయం అఖిలపక్ష ఒప్పందంలో ప్రస్తావితం కాలేదని తెలంగాణా విమోచనోద్యమ సమితి ప్రకటించింది.
తెలంగాణాలో అఖిలపక్ష ఒప్పందానికి ఇన్ని తిరకాసులురాగా, ఆంధ్ర ఉద్యోగులను తరలించే ప్రభుత్వ ఉత్తర్వును సవాలు చేస్తూ తెలంగాణాలోని ఆంధ్ర ఉద్యోగులు కొందరు హైకోర్టులో రిట్ దాఖల్ చేశారు. ఇంకోవైపున తెలంగాణాలోని ఆంధ్రుల రక్షణ అంటూ ఆంధ్ర ప్రాంతంలో విద్యార్థులు – తదితరులు – న్యాయవాదులు కూడా ఆందోళన ప్రారంభించారు.
జనవరి 24న శ్రీ రవీంద్రనాధ్ ఆమరణ నిరశన దీక్షను విరమించుకున్నారు. తిరుపతిలో ఒక తెలంగాణా ప్రాంత ఉద్యోగి భార్యను అవమానించారన్న వదంతి కార్చిచ్చులా వ్యాపింప చేయబడి తెలంగాణా ప్రాంతంలోని ఆంధ్రులపైనా ఆంధ్ర ప్రాంతంలోని తెలంగాణా వారిపైన అత్యాచారాలు ప్రారంభం కావటం ఆంధ్ర ప్రాంత పత్రికలు అన్నీ ఈ అత్యాచారాల బాధ్యతను ఉద్యమానికి అంటగట్టి చిలువలు పలువలుగా వార్తలూ, కథలూ, గాధలూ అల్లడం, ప్రభుత్వం “రక్షణ” పేరిట సైన్యాలను కూడా దింపి నిర్దోషులను, అమాయకులను నానాబాధల పాలు “చేయటం జరిగిపోయింది.
లోకసభలో తెలంగాణను వ్యతిరేకించిన ఆంధ్ర సభ్యులు
ఆంధ్ర ఉద్యోగుల రిట్ పై హైకోర్టు, ప్రభుత్వ ఉత్తర్వుల పై స్టే ఇచ్చారు. ఆ తరువాత ముల్కీ నిబంధనలే రాజ్యాంగ విరుద్దమని కొట్టివేయటంతో రక్షణ వాదులుగానున్న ఉద్యమకారులు కూడా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తప్ప ఈ సమస్య పరిష్కారానికి మరో మార్గాంతరం లేదన్న దృఢనిశ్చయానికి వచ్చారు. అఖిలపక్ష ఒప్పందంపై సంతకాలు చేసిన శ్రీ గౌతు లచ్చన్న ప్రభృతులు ఆ ఒప్పందం అమలులోనే లేదు పొమ్మన్నారు. పార్లమెంటులో ఆంధ్ర సభ్యులు ఉద్వేగ ప్రసంగాలు చేశారు. హోంమంత్రి శ్రీ చవాస్ . శ్రీ విద్యాచరన్ శుక్లాగార్లు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ను విడగొట్టే ప్రశ్నే లేదనీ, రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటానికి తీవ్ర చర్యలు తీసుకోబడగలవనీ ప్రకటించారు.
కాసుపై అవిశ్వాస తీర్మానం తెచ్చి ఓడించుకున్నారు
శాసనసభ శీతాకాలపు సమావేశాలలో శ్రీ బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం తెస్తానన్న ప్రతిపక్షాలవారు శాంతి భద్రతలు కాపాడలేకపోయినందు గాను నిరసన తీర్మానం తెచ్చి ఓడించుకున్నారు. ముల్కీ నిబంధనలను కొట్టివేసిన కోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం అప్పీలు చేసింది. రాష్ట్రంలో రాజధానీ నగరాలు సహ అనేక పట్టణాలలో 144 సెక్షనును ప్రభుత్వం అమలుచేసింది. శాసనసభ జరుగుతుండగా తెలంగాణలో ప్రజా సదస్సు కూడా హైదాబాద్ రెడ్డి హాస్టల్లో జరిగింది. ఉస్మానియాకు ప్రస్తుత వైస్ ఛాన్స్ లర్ అయిన శ్రీ రావాడ సత్యనారాయణగారీ సదస్సును ప్రారంభిస్తూ తెలుగు వారికి రెండు రాష్ట్రాలుండటం అవసరమన్నారు. సదస్సులో ఏప్రిల్ 9వ తేదీలోగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చెయాలనీ లేకపోతే ప్రత్యక్ష చర్య అవలంభిస్తామనీ తీర్మానించారు.
ఆ తరువాత శ్రీ ఎ. మదన్మోహన్ అధ్యక్షులుగా తెలంగాణా ప్రజాసమితి అవతరించి తెలంగాణా అంతటా శాఖోపశాఖలుగా వ్యాపించింది. ప్రజాసమితి ఆధ్వర్యంలో ఉద్యమ రంగంలోనికి ప్రజలు ప్రవేశించటమేగాక వివిధ సంస్థలు కూడా ప్రత్యేక రాష్ట్రం కోరికను వెల్లడిస్తూ తీర్మానాలు చేశాయి. తెలంగాణా బంద్ తో ప్రారంభమయి ప్రభుత్వ కార్యాలయాల ముందు పికెటింగ్ లూ తెలంగాణా మంత్రులు రాజీనామా ఇవ్వాలని వారిండ్ల ముందు ధారణలూ అరెస్టులు సాగాయి విద్యార్థులు – విద్యార్ధినులు, తదితరులు కూడా ఈ ఆందోళనలో విరివిగా పాల్గొన్నారు. వందలాది శిబిరాలలో వేలాది విద్యార్థులు అంచలవారీ నిరశన దీక్షలు కొనసాగించారు. పరీక్షలు, పంచాయితీ ఎన్నికలు కూడా వాయిదా వేశారు.





