వరుస షాక్‌లు ఇస్తున్న ట్రంప్‌

‌- కిచెన్‌ ‌కేబినెట్‌లు, అప్‌హోల్‌స్టర్డ్ ‌ఫర్నిచర్‌పై 25 శాతం
– కలప, ఫర్నిచర్‌పై 10శాతం సుంకాల విధింపు

వాషింగ్టన్‌,‌సెప్టెంబర్‌ 30:అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌ ‌మరో బాంబ్‌ ‌పేల్చారు. ఇటీవల చెప్పినట్టుగానే కలప, ఫర్నిచర్‌పై సుంకాల మోత మోగించారు. కలపపై 10 శాతం, కిచెన్‌ ‌కేబినెట్‌లు, అప్‌హోల్‌స్టర్డ్ ‌ఫర్నిచర్‌పై 25 శాతం సుంకాలను విధించారు. ఈ సుంకాలు అక్టోబర్‌ 14 ‌నుంచి అమల్లోకి రానున్నాయి. అమెరికా జాతీయ భద్రత, దేశీయ తయారీని పెంచడంలో భాగంగా ట్రంప్‌ ‌టారిఫ్‌లను వరుసగా పెంచుతున్నారు. కిచెన్‌ ‌కేబినెట్‌, ‌బాత్‌రూమ్‌ ‌పరికరాలు, అప్‌హోల్‌స్టర్డ్ ‌ఫర్నిచర్‌, ‌భారీ ట్రక్కులపై భారీ సుంకాలు విధిస్తానంటూ ఇటీవల డొనాల్డ్ ‌ట్రంప్‌ ‌ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కలప, కిచెన్‌ ‌కేబినెట్‌లు, అప్‌హోల్‌స్టర్డ్ ‌ఫర్నిచర్‌పై సుంకాలు విధించారు. అమెరికాలో ఫర్నిచర్‌ ‌తయారు చేయకపోతే భారీ స్థాయిలో సుంకాలను విధిస్తామని హెచ్చరించారు. చైనా సహా ఇతర దేశాల దిగుమతుల కారణంగా ఫర్నిచర్‌ ‌వ్యాపారానికి కేంద్ర స్థానంగా ఉండే నార్త్ ‌కరోలినా దాని ప్రభావాన్ని కోల్పోయిందని ట్రంప్‌ ‌పేర్కొన్నారు. ఇటీవలి నెలల్లో అమెరికాతో వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకున్న కొన్ని దేశాలు తాజా సుంకాల నుంచి బయటపడనున్నాయి. జాతీయ భద్రతా ముప్పును ఎదుర్కోవడానికి సుంకాలు విధించడానికి అనుమతించే సెక్షన్‌ 232 ‌ప్రకారం సుంకాలను డొనాల్డ్ ‌ట్రంప్‌ ‌వర్తింపజేస్తున్నారు. ఉక్కు, అల్యూమినియం, ఆటోమొబైల్స్, ‌రాగి సహా ఇతర దిగుమతులపై రంగాల వారీ సుంకాలను వర్తింపజేయడానికి అనేక సారూప్య దర్యాప్తులను ప్రారంభించింది. సినిమాలపై కూడా ట్రంప్‌ ‌భారీగా సుంకాలు ప్రకటించారు. అమెరికా వెలుపల నిర్మించే సినిమాలపై ఏకంగా 100 శాతం అదనపు టారిఫ్‌లు విధిస్తానని ప్రకటించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *