అమెరికా దాడిలో 40మంది పౌరుల మృతి

– విద్యుత్ వ్యవస్థ దెబ్బ‌తిన‌డంతో పలుచోట్ల అంధకారం
– వెనెజువెలా అధికార వర్గాల వెల్లడి

వాషింగ్టన్, జనవరి 5: వెనెజువెలాపై అమెరికా సైన్యం చేసిన దాడిలో కనీసం 40 మంది ప్రా ణాలు కోల్పోయినట్లుగా వెనెజువెలాకు చెందిన ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. మృతుల్లో సైనికులతో పాటు సాధారణ పౌరులు కూడా ఉన్నారని చెప్పారు. వెనెజువెలాపై భారీ దాడి అనంతరం అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన సతీమణి సిలియా ఫ్లోరెస్ను అదుపులోకి తీసుకున్నట్లుగా పేర్కొన్నారు. కాగా, వెనెజువెలాపై చేసిన దాడిలో తమవైపు ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని ఆమె రికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. కేవలం కొద్దిమంది మాత్రమే గాయపడ్డారని తెలిపారు. ఇది అత్యంత సంక్లిష్టమైన ఆఎరేషన్ అని పేర్కొన్నారు. మనవైపు ప్రాణనష్టం లేకుండా ఇంత పెద్ద ఆపరేషన్ పూర్తి కావడం ఆశ్చర్యకరమని వ్యాఖ్యానించారు. ఈ దాడిలో అనేక విమానాలు, హెలికాప్టర్లు, ఫైటర్ జెట్లు పాల్గొన్నాయని వెల్లడించారు. సాధారణంగా చొరబడలేని ప్రాంతాల్లోకి ప్రవేశించి, ఈ క్లిష్టమైన ఆపరేషన్ నిర్వహించామని చెప్పారు. వెనెజువెలా ప్రజలకు స్వేచ్ఛ కల్పించడమే అమెరికా లక్ష్యమని ట్రంప్ స్పష్టం చేశారు. వెనెజువెలా దేశంపై దాడి చేసి అధ్యక్షుడు నికొలస్ మదురో, అతని భార్య సిలియా ఎలోరన్ను అగ్రరాజ్యం అమెరికా బందీగా పట్టుకుని న్యూయార్క్ నగరానికి తీసుకుపోయిన క్రమంలో ఆ దేశ రాజధాని కారకాస్, పొరుగున ఉన్న నగరాల్లో తీవ్ర భయం, ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి.

ఆహారం కోసం ప్ర‌జ‌ల బారులు

ఆహారం కోసం పెద్దయెత్తున ప్రజలు బారులు తీరారు. పలు చోట్ల అంధకారం అలముకుంది. ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించింది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్న భయంతో చాలామంది ఇండ్లకే పరిమితమై పోయారు. చాలా సూపర్ మార్కెట్లు మూతపడ్డాయి. తెరిచి ఉంచిన చిన్న చిన్న దుకాణాల వద్ద 500-600 మంది బారులు తీరారు. ముఖ్యంగా ముందు జాగ్రత్తగా బ్రెడ్ దుకాణాల వద్ద జనం పెద్దయెత్తున చేరుకున్నారు. అలాగే మందుల షాపుల వద్ద కూడా ప్రజలు: ఎక్కువగా కన్పించారు. ఔషధాలతో పాటు అక్కడ అమ్మే కేన్స్డ్ ఫుడ్ను వారు కొనుగోలు చేయడం కన్పించింది. ప్రజలు తమ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల చార్జింగ్ కోసం ఎగబడ్డారు. కాగా, అక్కడ స్పల్ప సంఖ్యలో ఉన్న భారతీయ కమ్యూనిటీ కోసం భారత ఎంబసీ ఒక వాట్సాప్ గ్రూప్ను సృష్టించింది. దాని ద్వారా భారతీయులకు ఎప్పటికప్పుడు సూచనలు, ఆదేశాలు అందజేస్తున్నది. మెరికా దాడుల్లో పవర్ గ్రిడ్స్ దెబ్బ తినడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్తు లేక అంధకారం అలముకుంది. కమ్యూనికేషన్ వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అమెరికా దళాలు కారకాస్ ఎయిర్పోర్టుపై కూడా దాడి చేయడంతో రాజధాని నుంచి 100 కి.మీ వరకు ఎలాంటి వైమానిక ప్రయాణ సౌకర్యం లేదని భారత సంతతికి చెందిన సునీల్ మల్హోతా అనే స్థానికుడు తెలిపారు. ప్రజలు ఆహారం కోసం అల్లాడుతున్నారని, షాపుల వద్ద పెద్దపెద్ద క్యూలు ఏర్పడ్డాయని, పౌరుల్లో భయం, అనిశ్చితి, ఆందోళన నెలకొందని చెప్పారు. ఫ్యూర్టో ట్యూయనా వద్ద అధిక నష్టం వాటిల్లిం దన్నారు. కాగా, విద్యుత్తు స్తంభాల నుంచి అక్రమంగా వైర్లను లాగి కొందరు ఫోన్లకు చార్జింగ్ చేసే వ్యాపారం ప్రారంభించారు. ప్రస్తుత పరిస్థితులపై స్థానిక సంస్థలు కానీ, ప్రభుత్వం కానీ ప్రజలకు ఎలాంటి ప్రకటనలు చేయలేదు. అధికారులు కూడా పూర్తి అనిశ్చితి పరిస్థితుల్లో ఉన్నారు. అక్కడక్కడ పోలీసులు పరిస్థితులను నియంత్రించడానికి యత్నిస్తున్నారు.

అమెరికా బలప్రయోగంపై  చైనా ఆగ్రహం

బీజింగ్ : నెజువెలా అధ్యక్షడు నికోలస్ మదురో, ఆయన భార్యను అమెరికా నిర్బంధించడంపై చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ఏకపక్ష వేధింపులు ఈ మధ్యకా లంలో ఎక్కువయ్యాయని అగ్రరాజ్యంపై మండిపడింది. ప్రపంచ పోలీస్ లేదా అంత ర్జాతీయ న్యాయమూర్తిగా వ్యవహరించేందుకు ఏ దేశానికీ అధికారం లేదని పేర్కొంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా పరిస్థితులు అస్థిరంగా ఉన్నాయి. వెనెజువెలా పరిణామాలపై అంతర్జాతీయ సమాజం దృష్టిసారించింది.
‘బల ప్రయోగాన్ని చైనా ఎప్పు డూ వ్యతిరేకిస్తుంది. ఓ దేశం తమ ఇష్టాలను ఇంకో దేశంపై బలవంతంగా రుద్దకూడదు. ఏ దేశమైనా ప్రపంచ పోలీసు పాత్రను పోషించలేదు. అంతర్జాతీయ న్యాయమూర్తినంటూ తమను తాము సమర్థించుకోడం సరికాదు. అంతర్జాతీయ చట్టాలు దేశాల సార్వభౌమత్వాన్ని రక్షించాలి. అన్ని దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించినప్పుడే ప్రపంచ శాంతి సాధ్యమవుతుంది’ అని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ అబశ్రీశ్రీయీ వెల్లడించారు. రెండు దశాబ్దాలుగా వెనెజువెలాకు అతి పెద్ద చమురు కొనుగోలుదారుగా చైనా ఉంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *