భక్తుల సౌకర్యార్థం కొండపై అంబులెన్స్ ఏర్పాటు

– ఎస్పీఎఫ్ సిబ్బందికి పెట్రోలింగ్ వాహనం
– వాహన పూజలు చేసిన అధికారులు

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, డిసెంబర్ 17: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ భక్తుల సౌకర్యార్థం మెడికవర్ హాస్పిటల్ సౌజన్యంతో కొండపైన 24/7 అంబులెన్స్ సేవలు ఏర్పాట‌య్యాయి. ఆలయ అర్చకులు బుధవారం వాహనానికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, దేవస్థాన అధికారులు, ప్రధాన అర్చకులు, మెడికవర్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే ఆలయ, భక్తుల భద్రత నిమిత్తం యాదగిరిగుట్ట దేవస్థానంలో ఈవో వెంకట్రావు ఆదేశానుసారం దేవస్థానంలో విధులు నిర్వర్తిస్తున్న‌ ఎస్పీఎఫ్ సిబ్బందికి పెట్రోలింగ్ వాహనాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. ఈ వాహనంతో ఎస్పీఎఫ్ సిబ్బంది 24 గంటలూ కొండపై, కొండ కింద, గోశాల, పాత గుట్ట తదితర ప్రాంతాలలో నిరంత‌రం గస్తీ తిరుగుతూ భక్తులకు తగిన రక్షణ కల్పించ‌నున్న‌ట్లు ఈవో తెలిపారు. ఈ పెట్రోలింగ్ వాహనానికి కూడా ఆలయ అర్చకులు, అధికారులు పూజలు నిర్వహించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *