హైకోర్టు సీజేగా ఏకే సింగ్‌ ప్రమాణస్వీకారం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 19:తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా అవరేష్‌ కుమార్‌సింగ్‌ శనివారం ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో ఆయనచేత గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ప్రమాణస్వీకారం చేయించారు. ఏకేసింగ్‌ ఇంతకుముందు త్రిపుర హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి, శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. నూతన సీజేగా ప్రమాణం చేసిన ఏకేసింగ్‌కు సీఎం అభినందనలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *