దిల్లీలో వాయు కాలుష్యం తీవ్రత

– శిలాజ ఇంధనాల వాడకం కూడా ఓ కారణం
– మూడ్రోజుల్లోనే ఇన్‌ఫెక్షన్‌ ‌బారిన పడ్డా
– కేంద్ర మంత్రి నితిన్‌ ‌గడ్కరీ వెల్లడి

న్యూదిల్లీ, డిసెంబర్‌ 24: ‌దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం తీవ్రతపై కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ ‌గడ్కరి ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు తన శాఖ కూడా ఒక కారణమనే విషయాన్ని అంగీకరిస్తున్నానన్నారు. బుధవారం దిల్లీలో మాజీ కేంద్ర సమాచార కమిషనర్‌ ఉదయ్‌ ‌మాహూర్‌కర్‌ ‌రాసిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ భారతదేశం ఏటా రూ.22 లక్షల కోట్ల విలువైన శిలాజ ఇంధనాలను దిగుమతి చేసుకుంటోందని, ఇది కాలుష్యానికి ఒక కీలక కారణమవుతోందని అన్నారు. ‘నేను ఇక్కడ రెండ్రోజులుగా ఉంటున్నాను. దీంతో ఇన్‌పెక్షన్‌ ‌బారినపడ్డాను. దిల్లీ తీవ్ర కాలుష్యం గుప్పిట్లో ఉంది. నేను రవాణా శాఖ మంత్రిగా ఉన్నాను. రవాణా వల్లే 40 శాతం కాలుష్యం వస్తోంది. పెద్దఎత్తున శిలాజ ఇంధనం వాడకమే ఇందుకు కారణమవుతోంది. మనం ప్రత్యామ్నాయ పరిష్కరాలను అభివృద్ధి చేస్తున్నప్పటికీ వాటిని అందిపుచ్చుకునేందుకు ప్రజలు వెనకాడుతున్నారు’ అని గడ్కరి అన్నారు. బయో ఇంధనాల వాడకం ద్వారా స్వయం సమృద్ధి భారత్‌ ‌దిశగా మనం ముందుకు వెళ్లలేమా అని గడ్కరి ప్రశ్నించారు. తాను 100 శాతం ఇథనాల్‌తో కారును వాడుతున్నానని, ఇది 60 శాతం ఎలక్టిస్రిటీని జనరేట్‌ ‌చేస్తోందని, పొల్యూషన్‌ అనేదే లేదని చెప్పారు. గతంలోనూ నితిన్‌ ‌గడ్కరి దిల్లీలో గాలి నాణ్యత రోజురోజుకూ పడిపోతుండటంపై కీలక వ్యాఖ్యలు చేశారు. శిలాజ ఇంధనాల వాడకాన్ని గణనీయంగా తగ్గించాల్సిన అవసరం ఉంది. శిలాజ ఇంధనాలు పరిమితంగా ఉన్నాయి. కానీ కాలుష్యం మాత్రం పెరిగిపోతోంది. మనం వాటి వాడకాన్ని తగ్గించలేమా..? కాలుష్యాన్ని తగ్గించే ఎలక్ట్రి ‌వాహనాలు, హైడ్రోజన్‌ ఆధారిత వాహనాలకు ప్రోత్సాహం లభించాలని గడ్కరీ వ్యాఖ్యలు చేశారు. భారతదేశం శిలాజ ఇంధనాలపై ఏటా దాదాపు రూ.22 లక్షల కోట్లు ఖర్చు చేస్తోంది.కేంద్ర మంత్రి ఇథనాల్‌ ‌వాడకాన్ని ప్రోత్సహిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా తయారు చేసిన తొలి ప్లెక్స్‌ఫ్యూయల్‌ ‌కారును ఇప్పటికే  నితిన్‌ ‌గడ్కరీ ఆవిష్కరించారు. పెట్రోల్‌, ఇథనాల్‌ను కలిపి వినియోగించడాన్నే ప్లెక్స్‌ఫ్యూయల్‌ అని పిలుస్తారు. ఇది కాలుష్యాన్ని, శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుందని మంత్రి పేర్కొన్నారు. దిల్లీలో గాలి నాణ్యత రోజురోజుకూ పడిపోతోంది. మంగళవారం అతి తీవ్రస్థాయికి దిగజారింది. బుధవారం ఉదయం కాస్త మెరుగుపడింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *