కూతురు కోసం లండన్‌ ‌బయల్దేరి…: విజ‌య్ రూపానీ దుర్మ‌ర‌ణం

అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్ట్ ‌నుంచి లండన్‌ ‌బయలుదేరిన ఎయిర్‌ ఇం‌డియా విమాన ప్రమాదంలో మొత్తం 242 మంది మరణించారు. ఈ జాబితాలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్‌ ‌పౌరులు, 7 పోర్చుగిస్‌, ఒకరు కెనడియన్‌, 12 ‌మంది విమాన సిబ్బంది ఉన్నారు. ఈ విమాన ప్రమాదంలో గుజరాత్‌ ‌మాజీ సీఎం విజయ్‌ ‌రూపాని సైతం మరణించారు.

మరోవైపు 50 మృతదేహాలను విమాన శకలాల నుంచి వెలికి తీశారు. సహాయక చర్యలు కొనసాగుతోన్నాయి. ఎయిర్‌ ‌పోర్ట్ ‌నుంచి బయలుదేరే అన్ని విమానాలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఎయిర్‌ ‌పోర్టు అధికారులు ప్రకటించారు.ఇంకోవైపు ఈ విమానంలో ప్రయాణిస్తున్న గుజరాత్‌ ‌మాజీ సీఎం విజయ్‌ ‌రూపానీ మరణించారు. ఆయన కుమార్తె లండన్‌లో నివసిస్తుంది. ఈ నేపథ్యలంలో ఆమె వద్దకు వెళ్లేందుకు ఆయన లండన్‌ ‌ప్రయాణ మయ్యారు.

ఇక ఆయన భార్య అంజలి రూపానీ లండన్‌లో ఉన్నారు. ఆమెను తీసుకు వచ్చేందుకు ఆయన లండన్‌ ‌పయనమైనట్లు- విజయ్‌ ‌రూపానీ కుటుంబ సభ్యులు వివరించారు. ఈ విమానంలో ఆయన పేరుతో ఒక టికెట్‌ ‌తొలుత నెట్టింట వైరల్‌గా మారింది. అందులో బోర్డింగ్‌ ‌సమయం మధ్యాహ్నం 12.10 గంటలుగా ఉంది. ఆయన విమానం ఎక్కినట్లు నిర్ధరించే ప్యాసింజర్‌ ‌జాబితాలోనూ రూపానీ పేరు ఉంది.

లండన్‌లో ఉంటున్న తన కుమార్తెను చూసేందుకు విజయ్‌ ‌రూపానీ ఈ విమానంలో ప్రయాణానికి బుక్‌ ‌చేసుకున్నట్లు స్థానిక డియాలో కథనాలు వస్తున్నాయి. భాజపాకు చెందిన విజయ్‌ ‌రామ్‌నిక్‌ ‌లాల్‌భాయ్‌ ‌రూపానీ 2016 నుంచి 2021 వరకు రెండు సార్లు గుజరాత్‌ ‌ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె కాగా.. చిన్న కుమారుడు పూజిత్‌ ఓ ‌ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *