జనం సొమ్ముతో జలగలకు  ప్రచారం 

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మిస్ వరల్డ్  పోటీలు అనేక వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తుంది..మిస్‌ వరల్డ్ పోటీదారులను రోజుకోక ప్రాంతానికి తీసుకు వెళ్లి తెలంగాణ గొప్పదనాన్ని, తెలంగాణ సంస్కృతిని పరిచం చేస్తున్నారు.. రాష్ట్రంలో కీలకమైన ప్రదేశాలను తీసుకువెళ్లి అక్కడి ప్రత్యేకతలను ప్రపంచానికి చాటిచెప్పే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది.

.అయితే సుందరీమణుల వరంగల్‌లో పర్యటన అత్యంత వివాదాస్పదం అయింది..వేయి స్తంబాల గుడికి వొచ్చిన మిస్ వరల్డ్ కంటెస్టర్స్‌కు తెలంగాణ ఆడపడుతులతో కాళ్లు కడిగించడం రాష్ట్రంలో దుమారం చేలరేగింది..రాణి రుద్రమ దేవి, సమ్మక్క సారలమ్మ, చాకలి ఐలమ్మ  వంటి వీరవనితలు పుట్టిన గడ్డకు వొచ్చిన ప్రపంచ సుందరిమణుల కాళ్లు మన ఆడబిడ్డల తో  కడిగించి తెలంగాణ పౌరుషాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రపంచం  కాళ్ల దగ్గర పెట్టారని ప్రజలు మండిపడుతున్నారు..ఈ వివాదం పై తెలంగాణ సమాజానికి ప్రభుత్వం క్షమాపణలు చెప్పకుండా..తిరిగి ప్రజలపై మంత్రులు, కాంగ్రెస్‌ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు.అంతేకాదు జిల్లాకు వొచ్చిన అతిథులకు కాళ్లు కడిగి గౌరవించామని నిసిగ్గుగా మంత్రులు సమర్థించుకుంటున్నారు.దీని గెస్ట్‌ల ను గౌవరించడం, పాద పూజలు చేయడం తెలంగాణ, దేశ సంస్కృతి అంటూ మాట్లాడుతున్నారు..ప్రపంచ దేశాల ముందు తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడమే కాకుండా..ఇది ఈ దేశ ఆచారం అంటూ సమర్ధించు కుంటున్నారు.ఇంతకంటే దిక్కుమాలని రాజకీయం ఉండదు.  

మిస్‌ వరల్డ్ పోటీలు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది.రాష్ట్ర ప్రజలు కట్టిన పన్నులతో వారికి పంచభక్ష  పరమాన్నాలతో విందులు ఇస్తుంది.వారిని రాష్ట్రం మొత్తం తిప్పుతుంది..అయితే ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి పైసా జనం సొమ్మే..ఏ ప్రభుత్వం అంతర్జాతీయ ఈవెంట్  కండక్ట్‌ చేసిన ఆ ప్రభుత్వం పథకాలను, రాష్ట్రం, దేశం సాధించిన ప్రగతిని ప్రపంచానికి చెప్పాలనుకుంటుంది.అందుకు తగ్గట్టుగా  కార్యక్రమాలను నిర్వహిస్తుంది..ఆ కార్యక్రమంతో పెట్టుబడులు ఆకర్షించడమే కాకుండా..జాతి సంస్కృతిని ప్రపంచ వ్యాప్తంగా చేయాలనుకుంటుంది..అందుకోసం ప్రణాళికలతో ప్రభుత్వం ప్రోగ్రామ్స్ డిజైన్‌ చేస్తుంది..కానీ, తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఎక్కడ ఆ పని చేయడం లేదు..వరంగల్‌ పర్యటనలో ఆ ప్రయత్నం చేసిన అది వివాదాస్పంగా ముగిసింది.

మరోవైపు శుక్రవారం మెడికల్‌ టూరిజంలో భాగంగా ప్రభుత్వం మిస్‌ వరల్డ్ పోటీ దారులను నగరంలో ఓ ప్రైవేట్‌ హాస్పిటల్ తీసువెళ్లారు..నిజానికి ఆ హాస్పిటల్ కు  తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు..అది పూర్తిగా ప్రైవేట్‌ కార్పొరేట్‌ హాస్పిటల్ ..తెలంగాణ ప్రజలు కట్టిన  పన్నులతో  మిస్ వరల్డ్ పోటీ భామలు ఎంజాయ్‌ చేయడమే కాకుండా ఇప్పుడు ఏకంగా ఒక ప్రైవేట్‌ హాస్పిటల్ కు  వెళ్లి వారికి ఉచిత ప్రచారం కల్పించింది ప్రభుత్వం.జనాల సొమ్ముతో ప్రజలను జలగాల్ల పీక్కుతినే కార్పొరేట్‌ హాస్పిటల్ కు  అంతర్జాతీయ ప్రచారం రేవంత్‌ ప్రభుత్వం కల్పిస్తుంది. .ప్రభుత్వం సొమ్ముతో ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్స్ కు  ప్రపంచ ప్రచారం కల్నించడం ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వానికే సాధ్యం అవుతుంది.. ప్రజల సొమ్ముతో విశ్వ సుందరీమణులను ఓ కార్పొరేట్ హాస్పిటల్ కు  ఎందుకు తీసుకువెళ్లారు..దీనికి కాంగ్రెస్‌ ప్రభుత్వం సమాధానం చెప్పాలి..ప్రభుత్వ హాస్పిటల్స్ కు తీసుకువెళ్లి ప్రచారం కల్పిస్తే కనీసం సర్కార్‌ దావఖానాలైన బాగుపడేవి కదా..ఎందుకు ప్రభుత్వ హాస్పిటల్స్  పైన సర్కారు సవతి తల్లి ప్రేమ, వివక్ష చూపించడం సిగ్గు మాలిన తనానికి నిదర్శనం..ఏఐజీ ఏమైనా పేద ప్రజలకు ఉచితంగా వైద్యం చేస్తుందా..?..పేదల ఆరోగ్య బిల్లులల్లో ఏమైనా రాయితీ ఇస్తుందా..?. ఎందుకు ప్రభుత్వం ఏఐజీ ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్ ను  విశ్వ సుందరీమణుల ప్రచారంలో వాడుకుంది, నిజానికి తెలంగాణలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ప్రభుత్వ హాస్పిటల్స్  ఉన్నాయి..ప్రపంచంలో ఎక్కడా సాధ్యం కాని వైద్యం మన సర్కారు దావఖాన ల్లో  దొరుకుతుంది..ఉస్మానియా,, గాంధీ హాస్పిటల్స్  వైద్య రంగంలో అనేక అద్భుతాలు సృష్టించాయి, సృష్టిస్తున్నాయి..ఏప్రిల్ నెలలో ఉస్మానియా, గాంధీ, నిమ్స్ వైద్యులు అభినందించిన సీఎం ఎందుకు నిమ్స్, గాంధీ, ఉస్మానియా హాస్పిటల్స్  తీసుకుపోవడం లేదు.?.అంతేకాదు చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా నిలోఫర్‌ వంటి హాస్పిటల్  తెలంగాణలో ఉంది..చాలా దేశాల నుంచి గాంధీ, ఉస్మానియాతో పాటు చిన్న పిల్లల చికిత్స కోసం హైదరాబాద్‌కు వొస్తున్నారు.

అల్లోపతి,ఇంగ్లీస్ మెడిసిన్‌ వైద్యం మాత్రమే కాదు హోమియోపతి వైద్యానికి తెలంగాణ కేరాప్‌ అడ్రస్‌గా ఉంది..ఇంగ్లీష్  మెడిసిన్‌తో సాధ్యం కాని రోగాలను కూడా హోమియోపతి వైద్యం నయం చేసిన చరిత్ర తెలంగాణ సొంత..అంతేకాదు,ప్రపంచంలో రోజు రోజుకు అంధత్వం పెరిగిపోతుంటే తెలంగాణ ఎల్వీప్రసాద్ వంటి చారిటబుల్‌ ట్రస్ట్ ఆధ్వర్యం నడిచే నేత్రాలయాలు ఉన్నాయి. సరోజి నాయుడి వంటి గొప్ప కంటి దవాఖాన  తెలంగాణలో ఉంది..దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కంటి సమస్యలతో రోగులు రాష్ట్రానికి వొచ్చి చికిత్స చేసుకుంటారు.. గత పదేళ్లలో తెలంగాణలో ప్రభుత్వం ఆధ్వర్యంలో మెడికల్‌ ఇన్ఫ్రాస్ట్రక్టర్‌ పెరిగింది..ప్రభుత్వం పేదల వైద్యానికి సర్కార్‌ ఎక్కువ ప్రధాన్యత ఇస్తుంది..బీఆర్ఎస్‌ హయాంలో రాష్ట్రం నలువైపుల నాలుగు మల్టినేషన్‌ హాస్పిటల్స్ కు  ధీటుగా  పునాది వేసింది..జిల్లాకో మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీలు నిర్మించింది.దీంతో రాష్ట్రం మెడికల్ హబ్‌గా మారింది…వాటిని విశ్వసుందరీమణులకు చూపిస్తే ప్రభుత్వానికి ప్రజలకు ప్రయోజం ఉంటుంది..ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న గొప్ప హాస్పిటల్స్ ను  కాకుండా కేవలం పెద్ద పెద్దోళ్లు, బాగా డబ్బున్నోళ్లు  వెళ్లి వైద్యం చేసుకునే ఏఐజీ వంట మల్టీనేషన్‌ కార్పొరేట్‌ హాస్పిటల్ కు  వెళ్లి ప్రచారం చేయడం ఎంటీ..?..జనాల సొమ్ముతో ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్స్ కు  తీసుకుపోవడానికి ప్రభుత్వానికి సిగ్గుపడాలి..సర్కారు హాస్పిటల్స్  కాకుండా ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్స్ కు  ప్రచారం చేయడానికా ప్రభుత్వం అందాల పోటీలు పెట్టింది..ఇది అందాల పోటీ కాదు జనం సొమ్ముతో జలగాల్లా  పీల్చుకుతినే ప్రైవేట్ హాస్పిటల్స్  ప్రచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *