హైదరాబాద్,ప్రజాతంత్ర,మార్చి12: కల్తీ జాబితాలో పెరుగు కూడా చేరింది. నగరంలోని అంబర్‌పేటలో 2,500 కిలోల కల్తీ పెరుగును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పాలలో కాస్టిక్ సోడా వినియోగించి పెరుగు తయారు చేస్తున్నట్లు తనిఖీల్లో గుర్తించారు. అంబర్‌పేట పోలీసులు, ఖైరతాబాద్ టాస్క్‌ఫోర్స్, జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేప్టీ అధికారులు కలిసి ఈ తనిఖీలు చేపట్టారు. పెరుగు శాంపిళ్లను ల్యాబ్‌కు పంపారు.పెరుగు తయారీదారులపై చర్యలు తీసుకుంటామని అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.