నేను కూడా ఈ వారంలో వెబ్ సిరీస్ నెట్ ప్లెక్స్ లో చూడడం జరిగింది. అసలు సమాజంలో ఏం జరుగుతోంది ? మన మధ్య మనతో పాటు ఉండే పిల్లల భావోద్వేగాలు మనం ఎందుకు గమనించలేకపోతున్నాం ? ఎక్కడ ఉంది సమస్య? కౌమారం అనేది ప్రతి ఒక్క వ్యక్తికి తెలిసిందే మరి ఎందుకు కొన్నిసార్లు కొంతమందికి ఇది ఇంత ఝటిలంగా మారుతుంది? సినిమా చూసిన చాలా రోజుల తర్వాత కూడా ఇది ఇంకా నన్ను ఆలోచింపజేస్తుంది..మనం చాలాసార్లు కొన్ని ఘటనలు వింటుంటాం లేదా చూస్తుంటాం. ఉదాహరణకు ఒక పదహారేళ్ల మైనర్ రేప్ చేశాడని లేదా ఒక దొంగతనం చేశాడని, కానీ ఎప్పుడూ దాని చుట్టూ జరిగే సంఘటనని మనం గమనించం లేదా తెలుసుకొం.
కాబట్టి ఈ సంఘటనలని మనం కొద్ది రోజులలో మర్చిపోతాం. ఈ సినిమా విశ్లేషించే ముందు మనం ముఖ్యంగా అభినందించవలసింది దర్శకుడుని. సంఘటన మీద కంటే బాధితురాలికంటే కూడా ఆయన సంఘటనకి దారితీసిన అంశాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది . ఇది చాలా సార్లు మనం అంతగా గమనించని విషయం. ఒకసారి కథ విషయానికి వస్తే 13ఏళ్ల బాలుడు తన తోటి విద్యార్థిని ఏడుసార్లు కత్తితో పొడిచి చంపాడు .. ఇక్కడ మనం లోతుగా ఆలోచించవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. దాన్ని దర్శకుడు చాలా బాగా కథలో చూపించడం జరిగింది.
1. బాలుడు వయసు కేవలం 13 ఏళ్లు మాత్రమే.
2. బాలుడు తండ్రి తల్లి కుటుంబం ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబం .
3. తల్లి తండ్రికి జెమీ అంటే చాలా ప్రేమ మరియు నమ్మకం
4. జెమీ కి ఒక అక్క. ఆమె కూడా ఒక సాధారణ టీనేజ్ అమ్మాయి.
పైన చెప్పిన ఏ అంశం కూడా అసాధారణం కాదు. ఇది నన్ను చాలా ఆలోచింప చేసింది.
1. మన మధ్య మనతో ఉండే పిల్లలు ఎలా ఒక అసాధారణమైన లక్షణాలు చూపించగలరు?
2. ఎలా పదమూడేళ్ల సాధారణమైన అబ్బాయి అంత హింసాత్మకంగా మారి పోగలడు?
3. మన మధ్య ఉండే మన పిల్లల మనోగతాన్ని మనం ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం?
4. మనకు తెలియని పిల్లలకి మాత్రమే తెలిసే ఒక ప్రపంచం ఉంది. అలాంటప్పుడు మనం దాన్ని ఎందుకు నియంత్రించలేకపోతున్నాం?5. చిన్న ఇంట్లో ఒక గదిలో ఉండే పిల్లలు ఏమి ఆలోచిస్తున్నారో తెలుసుకోవడం అంత కష్టమా ?6. అస్సలు ఎలా పెంచాలి మనం మన పిల్లల్ని?
6. Red Pill, Incel 80-20 ,ఏంటి ఇవ్వన్నీ?7. టెక్నాలజీ అభివృద్ధి చెందినందుకు సంతోషించాలా ? లేక దాన్ని నియంత్రించలేని మన అసమర్ధతని విమర్శించుకోవాలా?
ఇలా చాలా ఆలోచనలు ..ఎక్కడ ఉంది సమస్య?ఈ సినిమాలో ముందుగా మనకు జేమీ అరెస్టు అవడం చూపిస్తారు. ఒక అమ్మాయిని ఏడుసార్లు పొడిచి చంపి ఎలా నార్మల్ గా ఉండగలుగుతున్నాడు ? ఎలా అతనికి ఇది తప్పు అనిపించలేదు? తన పేరెంట్స్ ని గురించిన ఆలోచన లేదు!! తప్పు చేశానని బాధ లేదు !!!! ఒకసారి మొత్తం సినిమా గమనిస్తే, జేమీ తాను మ్యాన్లీ గా ఉండను , తనలో ఆకర్షణ లేదు అనుకుంటాడు. అతను అందంగా ఉండును అనే సీలింగ్. దాంతో అతను ఒక ఊహ ప్రపంచం లో ఉంటాడు. ఉమెన్ ని విమర్శించే చేసే ఒక గ్రూపును ఫాలో అవుతుంటాడు. తన తోట విద్యార్థిని పెట్టిన ఇంస్టాగ్రామ్ పోస్ట్ వల్ల తీవ్ర మన స్థాపానికి గురి అవుతాడు. అసలు ఇది చాలా చిన్న విషయం కానీ తన చుట్టూ ఉన్న ఒక ఊహ ప్రపంచంలో ఇది చాలా పెద్ద విషయం అనుకుంటాడు.
అసలు సినిమాలో నన్ను చాలా కలిచి వేసిన విషయాలు కొన్ని
1. జెమీ చిన్న ఇంస్టాగ్రామ్ పోస్ట్ చూసి ఒక హత్య చేయాలని కోవడం.
2. దానికి కావాల్సిన కత్తి తన ఫ్రెండ్ ఇవ్వడం.3. అసలు స్కూల్లో తన తోటి విద్యార్థి చనిపోతే మిగతా విద్యార్థులు దాన్ని చాలా క్యాజువల్ గా తీసుకోవడం.
4. అసలు పిల్లలు ఏం చూస్తున్నారో మనం ఎవరం కంట్రోల్ చేయలేకపోవడం.
5. జెమీ ఇంకా కొంతమంది పిల్లలు చాలా అగ్గ్రెస్సివె గా ఉండడం.
6. చిన్న విషయాలకే జేమీ కి కోపం రావడం. 13 ఏళ్ల వయసులో అసలు కోపాన్ని నియంత్రించుకోలేక పోవడం.
7. స్కూల్లో నీ పిల్లలు తన తోటి విద్యార్థిని హత్య చేశాడు అంటే దాన్ని చాలా క్యాజువల్ గా తీసుకోవడం .
8. గత పది సంవత్సరాలలో టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది ఇంస్టాగ్రామ్ యూట్యూబ్ ఇంకా చాలా వెబ్ కంటెంట్ పిల్లలకి అందుబాటులోకి రావడం జరిగింది . కానీ దీని మీద నియంత్రణ లేకపోవడం ఎంతవరకు సమంజసం ?.
9. ఏ వయసు పిల్లలైనా పెద్దవారైనా ఏ కంటెంట్ అయినా చూడవచ్చు. ఇది చాలా బాధాకరం.
10 పిల్లలు చేసే పనుల మీద మన పెద్దల పర్యవేక్షణ ఉండాలి కానీ ఇది అన్ని సందర్భాలలో సాధ్యం కాదు నిజానికి అతి పర్యవేక్షణ కూడా ఒక సమస్య.ఎలా ఇటువంటి సమస్యని అధిగమించాలి?IQ వెంట పరిగెడుతున్నాం, మరి EQ (Emotional Quotient) మర్చిపోయామా?•A Dialogue is Powerfulమనం ఎప్పుడు పిల్లలతో మాట్లాడుతూ ఉంటే సమస్య కొంచెం తగ్గవచ్చు.
సామజిక మాధ్యమాల నియంత్రణతోకూడా కొంతవరకు సమస్యని పరిష్కరించవచ్చు. ప్రస్తుతానికి మాత్రం ఎలా ఇలాంటి సమస్యలను అధిగమించాలి అనేది ఒక ప్రశ్నగా మిగిలింది!! ప్రతి తల్లి తండ్రి, ఉపాధ్యాయులు, సమాజం కలిసి ఆలోచించవలసిన సమస్య.
సుచిత్ర పెసరి
సీనియర్ సాంకేతిక నిపుణురాలు





