కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

– స్కూటీని ఢీకొన్న టిప్పర్‌.. న‌లుగురు దుర్మరణం

కామారెడ్డి ,ప్రజాతంత్ర, అక్టోబర్‌ 15:‌ కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 44వ జాతీయ రహదారిపై రాంగ్‌ ‌రూట్లో వచ్చిన టిప్పర్‌ స్కూటీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానికుల ద్వారా సమచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసుల కథనం ప్రకారం జంగంపల్లి వద్ద ఉన్న 44వ జాతీయ రహదారిపై ఎలక్ట్రిక్‌ ‌స్కూటీపై నలుగురు కుటుంబ స‌భ్యులు ప్రయాణిస్తున్నారు. అదే సమయంలో రాంగ్‌ ‌రూట్లో వచ్చిన టిప్పర్‌ ‌స్కూటీని ఢీకొట్టింది. దీంతో 3 సంవత్సరాల బాలుడు, మహిళ, వృద్ధుడు అక్కకక్కడే మృతిచెందగా ఆరు నెలల పాప పరిస్థతి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆ పాపను కామారెడ్డి ఏరియా హాస్పిటల్‌కి తరలింగా చికిత్స పొందుతూ మ‌ర‌ణించిన‌ట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *