– ఆటో, కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురి దుర్మరణం
నల్గొండ, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 29: నల్గొండ జిల్లాలోని చింతపల్లి మండలం నసర్లపల్లి గేటు వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై ఆటో, కారు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులతోపాటు అదే రహదారిపై వెళ్లున్న వాహనదారులు వెంటనే స్పందించి.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని.. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని అత్యవసర చికిత్స కోసం దేవరకొండ ఏరియా హాస్పిటల్‌కి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఇక మృతదేహాలను సైతం స్వాధీనం చేసుకుని.. పోస్ట్‌మార్టం నిమిత్తం జిల్లా హాస్పిటల్‌కి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీంతో వీరంతా దేవరకొండ మండలం ముదిగొండ అవాసం మటిక తండా వాసులుగా పోలీసులు గుర్తించారు. మృతులు.. రాత్లావత్ భాస్కర్ (29), రాత్లావత్ వినోద్ (29), సఫవత్ రవి (29) గా గుర్తించినట్లు పోలీసుల తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





