లక్నో, ఆగస్టు 25: ఉత్తరప్రదేశ్‌లో సోమవారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిదిమంది దుర్మరణం చెందారు. ట్రాక్టర్ ట్రాలీని కాంటర్ ట్రక్ ఢీకొన్న ఈ ప్రమాదంలో మరో 42 మంది తీవ్రంగా గాయపడ్డారు. రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించారు. అయితే వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడిరచారు. కస్గంజ్ జిల్లాలోని రాఫత్‌పూర్ నుంచి రాజస్థాన్‌లోని జహర్‌పీర్‌కు వెళ్తుండగా బులంద్‌షహర్- అలీఘడ్ సరిహద్దుల్లోని అర్నియా బైపాస్ వద్ద ఈ ప్రమాదం జరిగిందని జిల్లా ఎస్పీ దినేష్ కుమార్ సింగ్ వెల్లడిరచారు. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో మొత్తం 61 మంది యాత్రికులు ఉన్నారని, పదిమంది స్వల్ప గాయాలతో బయటపడ్డారని తెలిపారు. కాంటర్ ట్రక్ వేగంగా ఢీకొట్టడంతో ట్రాక్టర్ ట్రాలీ తిరగబడిరదన్నారు. దీంతో క్షతగాత్రుల సంఖ్య భారీగా పెరిగిందని వివరించారు. క్షతగాత్రులంతా అలీఘడ్ మెడికల్ కాలేజీ, బులంద్‌షార్ జిల్లా హాస్పిటల్, కుర్జాలోని కైలాష్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారని వివరించారు. ఈ ప్రమాదం చోటు చేసుకుందన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండిరగ్ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్ చానల్‌ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మరిచిపోవద్దు.





