- ఏఐసీసీ పెద్దలతో ముఖ్యమంత్రి భేటీ
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 4 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఉదయం దేశ రాజధాని దిల్లీ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లిన ఆయన ఏఐసీసీ అగ్రనేతలతో సమావేశం అయ్యారు. ప్రధానంగా రాష్ట్రం నుండి ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై ఈ భేటీలో తుది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీకి దక్కే రాజ్యసభ స్థానాల్లో ఇప్పటికే ఒక స్థానానికి పార్టీ సీనియర్ నేత, ప్రముఖ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ పేరు దాదాపు ఖరారైది. రెండో స్థానం ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డికి కేటాయించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




