కానిస్టేబుల్ ను నిలదీసిన బీఆర్ఎస్, బీజేపి

– ఎల్లారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే జాజుల ఆందోళన

కామారెడ్డి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి11: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పలు ప్రాంతాల్లో పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా, ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. బాన్సువాడ మున్సిపాలిటీలో ఓ కానిస్టేబుల్ కాంగ్రెస్ పార్టీకి వోటు వేయాలని వోటర్లను ప్రలోభపెట్టారు. 9వ వార్డులో బందోబస్తు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ కాంగ్రెస్ పార్టీకి వోటేయాలని వోటర్లకు చెబుతుండగా అక్కడే ఉన్న బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు నిలదీశారు. దాంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అధికార పార్టీ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపిస్తూ ఎల్లారెడ్డి పట్టణంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. డీఎస్పీ, సీఐ, ఎస్సై మూకుమ్మడిగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకు మద్దతు తెలుపుతున్నారని, ఎన్నికల పక్రియను అపహస్యం చేస్తున్నారని మండిపడ్డారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *