నిజామాబాద్ రూరల్ లో 2 లక్షల ఎక‌రాలకు నీరు

– ప్యాకేజ్ 21-ఏ పనులు కొనసాగిస్తాం
– జిల్లాలో 7 లక్షల మెట్రిక్ టన్నుల ఖ‌రీఫ్‌ ధాన్యం దిగుబడి
– సన్నాలకు బోనస్ తో కలిపి చెల్లించిన‌ మద్దతు ధర 2000 కోట్లు
– జిల్లాలో 16 లక్షల మంది లబ్ధిదారులకు ఉచితంగా సన్న బియ్యం
-బి.ఆర్.ఎస్ హ‌యాంలో ఒక్క తెల్ల రేషన్ కార్డు మంజూరు లేదు
– కార్పొరేషన్ లోనే 3.15 లబ్ధిదారులకు ఉచితంగా సన్న బియ్యం
– అర్హులు తెల్ల రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోండి
– మంత్రి కెప్టెన్ఉ త్తమ్ కుమార్ రెడ్డి

నిజామాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 6:  నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం లో అదనంగా రెండు లక్షల ఎక‌రాల ఆయకట్టుకు సాగు నీరు అందించ నున్నట్లు రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.  అందుకనుగుణంగా ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి సహకారంతో ప్యాకేజ్ 21-ఏ పనులు ముందుకు కొనసాగిస్తామని ఆయన వెల్లడించారు.  శుక్రవారం సాయంత్రం నిజామాబాద్  నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిపిన అనంతరం జరిగిన ప్రజాపాలన-ప్రగతి బాట బహిరంగ సభలో మంత్రి  పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయ‌న మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా సంక్షేమం-అభివృద్ధి పరుగులు పెడుతుందని విజ్ఞులైన నిజామాబాద్ ప్రజలు వాటిని గుర్తించాలని ఆయన ఉద్బోధించారు.  వరిపంట సేద్యంలో విశిష్ట స్థానం పొందిన ఉమ్మడి నిజమాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాకా దాని ప్రాశస్త్యం మరింత పెరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. బి.ఆర్ ఎస్ పాలన చివరి అంకంలో ఖరీఫ్ సీజన్ లో అప్పటి ప్రభుత్వం 923 కోట్లు పెట్టి 4 లక్షల 20 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సన్నాలకు అందించే బోనస్,మద్దతు ధర కలిపి 2000 కోట్లు చెల్లించి 7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిన విషయమే అందుకు అద్దం పడుతుందన్నారు.  అదే విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం స్వతంత్ర భారత దేశ చరిత్రలోనే మైలు రాయిగా నిలిచి పోతుందని ఆయన చెప్పారు.  రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మాక మైన నిర్ణయంతో  ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 16 లక్షల మంది లబ్ధిదారులకు ఉచితంగా నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు.  గత బి.ఆర్.ఎస్ పాలనలో 12 లక్షల 80 వేల  మంది లబ్ధిదారులకు దొడ్డు బియ్యం పంపిణీ చేయగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అదనంగా అర్హులైన 1,20,000 మందిని కలిపి మొత్తం 16 లక్షల మందికి ఉచితంగా నాణ్యమైన సన్నబియ్యం అందిస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు.  ఒక్క నిజమాబాడ్ కార్పొరేషన్ పరిధిలోనే గత బి.ఆర్.ఎస్ పాలనలో రెండున్నర లక్షల మంది లబ్ధిదారులకు దొడ్డు బియ్యం పంపిణీ చేయగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాకా అధనంగా మరో 65 వేల మంది లబ్ధిదారులను కలిపి మొత్తం 3 లక్షల 15 వేల మందికి ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు.  బి.ఆర్.ఎస్ పదేళ్ల పాలనలో ఒక్కటి అంటే ఒక్కటి కుడా తెల్ల రేషన్ కార్డు మంజూరు చేయలేదని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాకా అర్హులైన వారందరికీ కొత్త తెల్ల రేషన్ కార్డులను మంజూరు చేసిన అంశాన్ని ఆయన గుర్తుచేశారు. నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో కానీ ఉమ్మడి నిజమాబాద్ జిల్లాలో కానీ ఇప్పటికీ అర్హులైన నిరుపేదలు కొత్త తెల్ల రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభాముఖంగా ప్రకటించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *