హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 27: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెక్రటేరియట్, శాసనసభ, లోక్ భవన్ ఉద్యోగులు, అధికారుల కోసం నిర్వహిస్తున్న సచివాలయ స్పోర్ట్స్ మీట్-2026 ఎల్బీ స్టేడియంలో మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సోనీ బాలాదేవి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉద్యోగుల శారీరక దృఢత్వంతోపాటు మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో అవసరమని, పనిలో ఒత్తిడిని తగ్గించి స్నేహభావాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. ఈ స్పోర్ట్స్ మీట్‌లో క్రికెట్, వాలీబాల్, టెన్నికాయిట్, బ్యాడ్మింటన్, చెస్, క్యారమ్స్, టేబుల్ టెన్నిస్, అథ్లెటిక్స్ (100 మీటర్లు, రిలే రేస్) వంటి పలు ఇండోర్ మరియు అవుట్?డోర్ క్రీడా పోటీలు నిర్వహిస్తారు. వివిధ విభాగాల నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గిరి శ్రీనివాస్ రెడ్డి, జనరల్ సెక్రటరీ ప్రేమ్, ట్రెజరర్ కైలాష్, స్పోర్ట్స్ సెక్రటరీ వంశీధర్ రెడ్డి, ఆఫీస్ బేరర్స్ నవీన్, ఆయిష తబస్సుమ్, రాము భూక్యా, కంచెర్ల శ్రీనివాస్ రెడ్డి, నీరజాక్షి, రాజేశ్వర్, కనక తార తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




