రథసప్తమి సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చిన స్వామి వారు..
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆదివారం రధసప్తమి సందర్భంగా శ్రీ స్వామి వారిని సూర్యప్రభ వాహనంపై ప్రత్యేక అలంకరణ చేసి ఉదయం గం.6.30లకు ఆలయ తిరుమాడ
వీధులలో ఊరేగింపు చేసి తూర్పు రాజగోపురం వద్ద చతుర్వేద పారాయణం మరియు రధసప్తమి విశిష్టత అర్చకులు భక్తులందరికి తెలియజేసారు.
అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. తిరిగి రాత్రి గం.7.00లకు శ్రీ స్వామి వారిని బంగారు రధం పై అత్యంత సుందరంగా అలంకరించి మేళతాళాలతో చతుర్వేద పారాయాణం తో
స్వామివారిని ఆలయ మాఢ వీధులలో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు ఆలయ అర్చకులు వేద పండితులు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.





