హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 10: స్వర్ణభారత్ ట్రస్ట్, ముచ్చింతల్ (హైదరాబాద్ చాప్టర్) ఆధ్వర్యంలో ఈనెల 11న సంక్రాంతి సంబరాలు, ట్రస్ట్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ముప్పవరపు ఫౌండేషన్ భవన ప్రారంభోత్సవం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సమక్షంలో జరగనున్న ఈ కార్యక్రమానికి త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి, కేంద్రమంత్రి గంగాపురం కిషన్ రెడ్డి, ప్రముఖ సినీ నటుడు బ్రహ్మానందం ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రజా మందిరంలో జరిగే ఈ కార్యక్రమాల్లో భాగంగా సంక్రాంతి ప్రాశస్త్యంపై ప్రముఖ ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావు ప్రవచనం కూడా ఉంది. మరిన్ని వివరాలకు అట్లూరి రామకృష్ణ – 9849038218, తుమ్మల బాలగంగాధర్ తిలక్ 8008001829లను సంప్రదించాల్సిందిగా నిర్వాహకులు కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





