– మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 30: పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం చట్టబద్ధంగా, దృఢం గా పోరాడుతున్నదానికి స్పష్టమైన నిదర్శనమే సుప్రీంకోర్టులో దాఖలైన రిట్ పిటిషన్ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పోలవరం-బనకచర్ల ప్రాజెక్ట్పై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్ జనవరి 5వ తేదీ సోమవారం, భారత ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు, విచారణకు లిస్ట్ అయిందని ఆయన వెల్లడించారు. ఈ కేసు ద్వారా రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం ప్రభుత్వం ఆక్రమణాత్మకంగా, చట్టపరంగా ముందుకెళోందని స్పష్టం అవుతోందన్నారు. ఈ నేపథ్యంలో హరీష్ రావు మీడియాకు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమని, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమేనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. నీటిపారుదల అంశంలో వాస్తవాలను వదిలిపెట్టి రాజకీయ దుష్ప్రచారం చేయడం తగదని ఆయన హెచ్చరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





