లోకసభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ని శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు . టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ , ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ మర్యాదపూర్వకంగా కలిసారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే గా గెలిచిన నవీన్ యాదవ్ సహా పలువురు సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. తెలంగాణలో ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి–సంక్షేమ కార్యక్రమాలపై, రాబోయే కార్యాచరణపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆర్గనైజేషన్ ఇన్‌ఛార్జ్ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు
లోకసభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ని కలిసిన సీ ఎం రేవంత్ రెడ్డి బృందం





